Home > EDUCATION > 10th Class > 10th Memo – పది మార్కుల మెమోల్లో మార్కులు, గ్రేడ్లు

10th Memo – పది మార్కుల మెమోల్లో మార్కులు, గ్రేడ్లు

BIKKI NEWS (APR. 28) : 10th marks memos with marks and grades. తెలంగాణ పదో తరగతి మార్కుల మెమోలపై ఇకనుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు విడుదల చేశారు.

10th marks memos with marks and grades.

ఇప్పటి వరకు పదో తరగతిలో సబ్జెక్టుల వారీగా గ్రేడ్లతోపాటు.. క్యుములేటివ్‌ గ్రేడింగ్‌ పాయింట్‌ యావరేజ్‌ (CGPA) ఇచ్చేవారు. ఇకనుంచి సబ్జెక్టుల వారీగా మార్కులు, గ్రేడ్లు ఇస్తారు. జీపీఏ అనేది ఇవ్వరు.

మార్కుల మెమోలపై సబ్జెక్టులవారీగా.. రాత పరీక్షలు, అంతర్గత పరీక్షల మార్కులు, మొత్తం మార్కులు, గ్రేడు పొందుపరుస్తారు. చివరగా విద్యార్థి పాసయ్యారా? ఫెయిల్‌ అయ్యారా? అనేది ఇస్తారు.

ఇంకా బోధనేతర కార్యక్రమాల(కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌)లో విద్యార్థులకు గ్రేడ్లు ఇస్తారు.

వర్క్‌ అండ్‌ కంప్యూటర్‌ ఎడ్యుకేషన్, ఫిజికల్‌ అండ్‌ హెల్త్‌ ఎడ్యుకేషన్‌, వాల్యూ ఎడ్యుకేషన్‌ అండ్‌ లైఫ్‌ ఎడ్యుకేషన్, ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ ఎడ్యుకేషన్ అనే నాలుగు కో కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు సంబంధించి గ్రేడ్లు కూడా ముద్రిస్తారు.

పదో తరగతిలో మార్కుల మెమోలు విషయమై స్పష్టత ఇవ్వడంతో ఫలితాలు ఎప్రిల్ 30వ తేదీన విడుదల చేసే అవకాశం ఉంది.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు