DSC 2024 – 1,056 టీచర్ పోస్టుల పెండింగ్

BIKKI NEWS (OCT. 09) : 1056 POSTS ARE PENDING IN TG DSC 2024. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు డీఎస్సీ 2024 ద్వారా నియామకం అయినా టీచర్లకు నియామక పత్రాలను అందజేస్తున్న సంగతి తెలిసిందే.

1056 POSTS ARE PENDING IN TG DSC 2024

ఈ నేపథ్యంలో 1,056 పోస్టులకు నియామక పత్రాలను ప్రస్తుతానికి ఇవ్వడం లేదు. కోర్టు కేసులు మరియు ఇతర కారణాల వలన ఈ పోస్టుల నియామక పత్రాలను తర్వాత అందజేయనున్నారు.

మొత్తం ఈ నోటిఫికేషన్ ద్వారా 11,062 పోస్టులను భర్తీ చేయాల్సి ఉండగా ఈరోజు 10,006 మందికి మాత్రమే నియామక పత్రాలు అందజేయనున్నారు. మిగిలిన 1056 పోస్టులకు తర్వాత నియామక పత్రాలు అందజేయనున్నారు.

స్కూల్ అసిస్టెంట్ 2629 కి 2515 మందికి,
భాష పండితులు 727 కి 685 మందికి,
ఎస్జీటి 6508 కి 6277 మందికి,
పీఈటీ 182 కు 145 మందికి,
స్కూల్ అసిస్టెంట్ స్పెషల్ ఎడ్యుకేషన్ 220 కు 103 మందికి
ఎస్జీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ 796 కు 281 మందికి
మాత్రమే నియామక పత్రాలు అందజేయనున్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు