BIKKI NEWS (DEC. 18) : 101.66 marks out of 100 in madya pradesh. మధ్యప్రదేశ్ ఎంప్లాయిస్ సెలక్షన్ బోర్డు జైళ్ళు, అటవీ శాఖలలో గార్డ్ పోస్టులకు నిర్వహించిన పరీక్షలో ఒక అభ్యర్థికి 100 మార్కులకు గానూ 101.66 మార్కులు రావడం సంచలనంగా మారింది. దీనిపై భారీగా నిరసనలు కొనసాగుతున్నాయి..
101.66 marks out of 100 in madya pradesh.
ఈ ఉదంతంపై అభ్యర్థులు ఇండోర్ కలెక్టరేట్ ఎదుట నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే న్యాయపరంగా ఎదుర్కోవడానికి కోర్టులో కేసులు కూడా వేశారు. కోర్టు లలో తమకు న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని తెలిపారు.
అయితే నియామక బోర్డు నార్మలైజేషన్ కారణంగా అభ్యర్థులకు వంద కంటే ఎక్కువ, సున్నా కంటే తక్కువ మార్కులు కూడా రావచ్చని తమ వాదనను వినిపించింది.
ఒకే సబ్జెక్టులో వేరువేరు ప్రశ్న పత్రాలతో పరీక్షలు నిర్వహించినపుడు నార్మలైజేషన్ ప్రక్రియను రిక్రూట్మెంట్ బోర్డులు వాడుతున్న సంగతి తెలిసిందే. నార్మలైజేషన్ తర్వాత వచ్చిన మార్కులని ఫైనల్ మార్కులగా నిర్ణయిస్తారు. దీని ఆధారంగానే ర్యాంకులను కేటాయిస్తారు.
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్