Agniveer – మాజీ అగ్నివీరులకు 10% రిజర్వేషన్లు

BIKKI NEWS (JULY 12) : 10% reservation s for agniveers. మాజీ అగ్ని వీరులకు నూతన నియామకాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని CISF, BSF, CRPF డైరెక్టర్ జనరల్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ మేరకు కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకున్నట్లు వీరు తెలిపారు.

త్వరలో భర్తీ చేయనున్న కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో ఈ రిజర్వేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే మాజీ అగ్ని వీరులకు దేహదారుడ్య పరీక్షల్లో మినహాయింపు ఉండనుంది. మరియు వయోపరిమితిలో కూడా సడలింపు అవకాశాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు