YTDA ADMISSIONS : టెంపుల్ ఆర్కిటెక్చర్ కోర్సులో అడ్మిషన్లు

యాదాద్రి (అక్టోబర్ – 05) : యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(YTDA) ఆధ్వర్యంలో BA TEMPLE ARCHITECTURE మూడేండ్ల డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సీఈవో కిషన్ రావు తెలిపారు.

ఆసక్తి, అర్హత ఉన్న విద్యార్థులు అక్టోబర్ 16లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వివరాలకు 040-23400616, 9705887664 నంబర్లను సంప్రదించాలని కోరారు.

వెబ్సైట్ : https://ytda.in/