Home > TODAY IN HISTORY > WORLD BLOOD DONAR DAY – JUNE 14th

WORLD BLOOD DONAR DAY – JUNE 14th

BIKKI NEWS (JUNE 14) : WORLD BLOOD DONAR DAY JUNE 14th. ప్రపంచ రక్త దాతల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్‌14న నిర్వహిస్తున్నారు

WORLD BLOOD DONAR DAY JUNE 14th

చరిత్ర

1901లో ఆస్ట్రేలియాకు చెందిన నోబెల్‌ విజేత కార్ల్‌ లాండ్‌స్టీనర్‌ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు. దీంతో ఆయన జయంతి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 2004లో అన్ని దేశాల్లో నిర్వహించాయి.

ర‌క్త‌దానం

రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి వీలుకాదు. అయితే రక్తదాతలు ఎవరైనా రక్తాన్ని దానం చేసి, మరొకరి ప్రాణాలను కాపాడవచ్చు. 18 సంవత్సరాలు నుండి 55ఏళ్ల లోపు ఉన్నవారు రక్తదానానికి అర్హులు. కనీసం రక్తదాతల శరీర బరువు 50 కిలోలు ఉండాలి. రోగ నివారణ కోసం, ప్రమాదాల సమయంలో బాధితుల శరీరంలో తగినంతగా రక్తం లేకపోతే మరొకరి నుంచి రక్తాన్ని ఎక్కిస్తుంటారు. ఇలా ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే విధానమే రక్తదానం. రక్తాన్ని తీసుకొనే వ్యక్తిని గ్రహీత అని, ఇచ్చే వ్యక్తిని దాత అని అంటారు. ‘ఓ’ గ్రూప్‌రక్తం కలిగిన వారిని విశ్వదాత అని, ‘ఏబీ’. గ్రూపుల రక్తం కలిగినవారిని విశ్వగ్రహీత అని అంటారు.

రక్తదానం అపోహలు-వాస్తవాలు

రక్తదానం చేస్తే బలహీనపడి, నీరసించిపోతారు ఒక అపోహ ఉంది కానీ రక్తదానం తర్వాత ఎటువంటి బలహీనత సంభవించదు.ఎప్పటిలా ఆరోగ్యంగా ఉంటారు.
శ్రమతో కూడిన కష్టమైన పనులు చేసుకునేవారు ఇంతకుముందులా పనిచేసుకోలేరు ఒక అపోహ ఉంది కానీ రక్తదానం తర్వాత యధావిధిగా అన్నిరకాల శ్రమతో కూడిన పనులు చక్కగా చేసుకోవచ్చు.
రక్తదానం చేసే సమయంలో విపరీతమైన నొప్పి ఉంటుంది అని ఒక అపోహ ఉంది కానీ రక్తదానం సమయంలో ప్రత్యేకమైన సూది గుచ్చేటప్పుడు కలిగే చిన్నపాటి నొప్పి తప్పించి ఎటువంటి తీవ్రమైన నొప్పి ఉండదు.
రక్తదానం వల్ల ఎయిడ్స్‌ సంక్రమించవచ్చు అని ఒక అపోహ ఉంది. వాస్తవానికి రక్తదానం పూర్తి శాస్ర్తీయమైన, సురక్షితమైన పద్దతులలో ఏ రకమైన వ్యాధి క్రిములు సోకే అవకాశంలేని విధంగా జరుగుతుంది.

రక్తదానం – ఆరోగ్యకరం

రక్తదానం వలన ఆరోగ్యం మెరుగవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తంలో ఐరన్ స్థాయిలో క్రమబద్ధీకరించబడతాయి. రక్త దానం చేసిన వ్యక్తి బరువు తగ్గే అవకాశం ఉంది. గుండె సంబంధిత వ్యాధులు తగ్గే అవకాశం ఉంది. కొత్త రక్తం ఉత్పత్తి రక్త ప్రసరణ మెరుగుపడే అవకాశం ఉంది. శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

రక్తదానం ఎవరు, ఎప్పుడు చేయవచ్చు
  • పురుషులు – 90 రోజులకొకసారి
  • మహిళలు – 120 రోజులకొకసారి
  • 18 – 65 ఏళ్ళు కలిగి ఉండాలి.
  • కనీసం 45 కేజీల బరువు ఉండాలి.
  • దగ్గు, జలుబు, జ్వరం, ఇన్ఫెక్షన్ లు ఉండకూడదు.
  • వ్యాక్సిన్ వేసుకున్నారు 15 రోజుల తర్వాత దానం చేయాలి
రక్తంలో ఏ భాగాన్ని ఎన్ని సార్లు దానం చేయవచ్చు
  • పూర్తి స్థాయిలో రక్తం – 90 రోజులకొకసారి
  • ప్లాస్మా -28 రోజులకొకసారి
  • ప్లేట్‌లెట్స్ -14 రోజులకొకసారి
  • ఎర్రరక్త కణాలు – 112 రోజులకొకసారి

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు