Home > BUSINESS > WORLD BANK REMITTANCE REPORT – ప్రవాస భారతీయులదే అగ్రస్థానం –

WORLD BANK REMITTANCE REPORT – ప్రవాస భారతీయులదే అగ్రస్థానం –

BIKKI NEWS (DEC. 20) : వీదేశాలలో జీవిస్తున్న ప్రవాసులు తమ స్వదేశానికి అత్యధికంగా నిధులు పంపిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక (World Bank Remittance Report 2023) తెలిపింది.

ఈ నివేదిక ప్రకారం 2023లో మన దేశానికి 125 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10.37 లక్షల కోట్ల) ను ప్రవాస భారతీయులు పంపించారని పేర్కొంది.

ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూపాయి, దిర్హామ్ ను ఉపయోగించడాన్ని ప్రోత్సహించేందుకు యూఏఈతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం లాంటి పలు అంశాలు ఇందుకు దోహదం చేశాయని నివేదిక తెలిపింది.

అయితే భారత్ కు ప్రవాసులు పంపించిన నిధులు పెరగడం మాత్రం 2022తో పోలిస్తే సగానికి తగ్గిందని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. 2021తో పోలిస్తే 2022లో రికార్డు స్థాయిలో 24.4 శాతం వృద్ధి ఉండగా.. 2022తో పోలిస్తే 2023లో వృద్ధి 12.4 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. భారత్ తర్వాత ప్రవాసులు తమ స్వదేశానికి అత్యధికంగా నిధులు పంపిన దేశాల్లో మెక్సికో రెండో స్థానంలో (67 బిలియన్ డాలర్లు) ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో చైనా (50 బిలియన్ డాలర్లు), ఫిలిప్పీన్స్ (40 బిలియన్ డాలర్లు), ఈజిప్ట్ (24 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.

భారత్ కు అత్యధికంగా యూఏఈ నుంచి ప్రవాసులు నిధులు పంపిస్తున్నారు. ప్రవాసులు పంపిస్తున్న మొత్తం నిధుల్లో ఈ దేశం వాటా 18 శాతం. ఆ తర్వాతి స్థానంలో అమెరికా ఉంది.