BIKKI NEWS (JAN. 05) : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పార్టీ విస్తృత సాయి మీటింగులు ఇందిరమ్మ కమిటీలను ఊరు వాడ ఏర్పాటు చేయాలని ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణలో దాదాపు 80000 వాలంటీర్ ఉద్యోగాలు నియామకం (VOULENTEER JOBS IN TELANGANA) చేపట్టనున్నట్లు సమాచారం.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమల్లో ఉన్న వలంటీర్ లాంటి వ్యవస్థ తెలంగాణలోనూ రాబోతు న్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో వాలంటీ వ్యవస్థ తీసుకొచ్చే యోచన ఉన్నట్లు తెలిపారు. తాము అధికారంలోకి వస్తే కార్యకర్తలను వలంటీర్లుగా నియమిస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి విస్పష్టంగా చెప్పారు. ఇప్పుడు దీనిని అమలు చేయబోతున్నట్టు తెలుస్తున్నది.
ఇందులో భాగంగానే ‘ఇందిరమ్మ కమిటీ’లను ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే కార్యాచరణ ప్రారంభమైనట్టు సమాచారం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తున్నారు.
ఆరు గ్యారెంటీల అమలు, కార్యకర్తలకు ఉపాధి కల్పన, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటివాటికి సంబంధించి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నది. వలంటీర్ల నియామకంలో భాగంగానే ‘ఇందిరమ్మ కమిటీ’లను తెరపైకి తీసుకొచ్చారన్న ప్రచారం జరుగుతున్నది. ఆరు గ్యారెంటీల అమలు కోసం గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేయాలని బుధవారం జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ సీనియర్ నేత మల్లు రవి స్వయంగా ప్రకటించారు.
ఈ కమిటీలో ఐదు నుంచి ఆరుగురు సభ్యులుంటారు. వీరంతా కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులేనని కూడా ప్రకటించారు. దీనినిబట్టి చూస్తే ఇది పక్కాగా వలంటీర్ వ్యవస్థేనని తేలిపోయింది. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపు 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ లెక్కన దాదాపు 80వేలమంది వలంటీర్లను నియమించాల్సి ఉంటుంది.
ఏపీలో ఒక్కో వలంటీరు రూ. 5 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తుండగా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఇస్తుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.