UPI – మొట్టమొదటి లావాదేవీకి 4 గంటల సమయం

BIKKI NEWS (నవంబర్ – 29) : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) గణాంకాల ప్రకారం UPI TRANSACTIONS ద్వారా 2022-23 సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.30,252 కోట్లు కొట్టేశారు.

ఈ నేపథ్యంలో ప్రజా ధనాన్ని కాపాడేందుకు కొత్త నిబంధనలను తేవాలని కేంద్రం యోచిస్తోంది. తప్పుడు/మోసపూరిత యూపీఐ లావాదేవీ ద్వారా భారీ మొత్తం ఖాతా నుంచి చోరీ అయితే ఆ 4 గంటలలోపు ఫిర్యాదు అందితే బాధితులకు తక్షణ సాయం చేసేందుకు అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది.

డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఇద్దరి మధ్య జరిగే తొలి లావాదేవీలో నగదు భారీగా రెప్పపాటులో బదిలీ కాకుండా ఆపాలని భావిస్తోంది. కనీసం 4 గంటల సమయం మొదటి లావాదేవీలను ఆపాలని భావిస్తోంది.

ఈ నిబంధన అమల్లోకి వస్తే రూ 2వేలు వంటి చిన్న మొత్తాలను వెంటనే యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపుల ద్వారా పంపుకోవచ్చు. అంతకంటే ఎక్కువ మొత్తాలను పంపాలంటే ఆ ట్రాన్సాక్షన్ పూర్తికి 4 గంటల వ్యవధి పెట్టాలని కేంద్రం భావిస్తోంది. గతంలో ట్రాన్సాక్షన్ జరగని ఖాతాలకు మాత్రమే దీనిని అమలు చేయనున్నారు.