BIKKI NEWS (FEB. 27) : Universal Pension Scheme for all indians. దేశంలోని పౌరులందరికీ పింఛన్ అందించే కొత్త పథకాన్ని ప్రారంభించాలని కేంద్రం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అవసరమైతే ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని పథకాలను విలీనం చేసి ఒకే ఒక సార్వత్రిక పింఛన్ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో పౌరులందరికీ ఒకే పింఛన్ పథకం అమలయ్యే అవకాశం ఉంది.
Universal Pension Scheme for all indians
ముఖ్యంగా రైతులు, నిర్మాణరంగ కార్మికులు, ఇళ్లల్లో పనిచేసే వాళ్లు, గిగ్ వర్కర్లు, నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి పథకాలు అమలు కావడం లేదని భావించిన కేంద్రం ఈ సార్వత్రిక పింఛన్ పథకానికి శ్రీకారం చుట్టినట్లు సమాచారం.
అటల్ పెన్షన్ యోజన, పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన, పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన వంటి పెన్షన్ పథకాలు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. వీటి ద్వారా 60 సంవత్సరాలు నిండిన పౌరులకు 1000 రూపాయల నుండి 3000 రూపాయల వరకు పెన్షన్ లభించే స్థితి ఉంది.
ఈ పథకాల కింద పౌరులు నెలకు 55 రూపాయల నుండి 200 రూపాయల వరకు చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే రాష్ట్ర ప్రభుత్వాల పెన్షన్ పథకాలు ఏమైనా ఉంటే ఈ సార్వత్రిక పెన్షన్ పథకంలో విలీనం చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది.
చైనా, అమెరికా, కెనడా, రష్యా వంటి దేశాలు అందరికీ పెన్షన్లు, అందరికీ ఆరోగ్య రక్షణ మరియు నిరుద్యోగులకు ప్రయోజనాలు కల్పించే సార్వత్రిక పథకాలను తీర్చిదిద్ది విజయవంతంగా అమలు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో భారత దేశంలో కూడా సార్వత్రిక పెన్షన్ పథకాన్ని పౌరులందరికీ అమలు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఈ పథకం అమలు కొరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కసరత్తు చేస్తుంది.
- GK BITS IN TELUGU MARCH 27th
- చరిత్రలో ఈరోజు మార్చి 27
- EAMCET, NEET, JEE FREE VIDEO CALSSES
- గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ లను కొనసాగిస్తాం – మంత్రి హమీ
- GK BITS IN TELUGU MARCH 26th