Home > BUSINESS > UNION BUDGET 2024 – కేంద్ర బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు

UNION BUDGET 2024 – కేంద్ర బడ్జెట్ 2024 ముఖ్యాంశాలు

BIKKI NEWS (FEB. 01) : UNION BUDGET 2024 HIGHLIGHTS – కేంద్ర బడ్జెట్ 2024 ను ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ రూపంలో ప్రవేశపెట్టనున్నారు. లైవ్ బడ్జెట్ ముఖ్యాంశాలు…

ఈ సంవత్సరం సాదరణ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలిక బడ్జెట్ నే ప్రవేశపెట్టనున్నారు. ఇది ఎన్నికల బడ్జెట్ కావడంతో వరాలు జల్లు కురిపించే అవకాశం ఉంది.

★ అన్ని వర్గాలకు ఆలంబన

పేదలు, మహిళలు, యువత, రైతుల జీవితాలలో మోదీ ప్రభుత్వం వెలుగులు నింపిందని తెలిపారు.

★ ఆదాయపు పన్నులో స్టాండర్డ్ డిడక్షన్ పెంపు

మధ్యతరగతికి ఊరట కల్పించే ఆదాయపన్ను మినహాయింపు గతంలో మాదిరిగానే స్లాబ్ లు ఉంచారు. నూతన పన్ను విధానం లో 7 లక్షల వరకు పన్ను మినహాయింపు కలదు.

కానీ స్టాండర్డ్ డిడక్షన్ ను 50 వేల నుంచి 75 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

★ ప్రజల ఆదాయం 50% పెరిగింది

ఎన్ని ఆర్థిక అడ్డంకులు ఎదురైనా ప్రపంచ ఆర్థిక సంక్షోభం లో ఉన్న భారతీయుల ఆదాయం 50% పెరిగినట్లు తెలిపారు.

★ 2 కోట్ల ఇళ్ళ నిర్మాణం

ఆశాలు, అంగన్‌వాడీలకు ఆయుష్మాన్‌ పథకం వర్తింపు. బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నెరవేరుస్తాం. ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. మధ్య తరగతి కోసం నూతన గృహ నిర్మాణ విధానం తెస్తున్నాం. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్‌ యోజన కింద 2 కోట్ల ఇళ్ల నిర్మాణం.

★ 300 యూనిట్ల ఉచిత విద్యుత్

రూఫ్‌ టాప్‌ సోలార్‌ పాలసీ (పీఎం సూర్యోదయ యోజన) విధానం కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌.

★ 2047 నాటికి వికసిత భారత్

భార‌త్‌ను 2047 నాటికి విక‌సిత భార‌త్‌గా తీర్చిదిద్దేందుకు త‌మ ప్రభుత్వం ప‌నిచేస్తోంద‌ని ఆమె అన్నారు. దేశ ప్రజ‌ల స‌గ‌టు ఆదాయం 50 శాతం పెరిగిన‌ట్లు తెలిపారు. గ‌డిచిన ప‌దేళ్లలో మ‌హిళ‌ల సాధికార‌త పెరిగింద‌న్నారు.

ట్రిపుల్ త‌లాక్‌ను చ‌ట్టరీత్యా నేరం చేశామ‌న్నారు.

ప్రభుత్వ స్కీమ్ కింద 70 శాతం మంది మ‌హిళ‌ల‌కు ఇండ్లు అంద‌జేసిన‌ట్లు చెప్పారు.

అన్ని ర‌కాల మౌలిక‌స‌దుపాయాల్ని రికార్డు స‌మ‌యంలో క్రియేట్ చేస్తున్నట్లు తెలిపారు.

భార‌త అభివృద్ధిలో దేశంలోని అన్ని ప్రాంతాలు భాగ‌స్వామ్యం అవుతున్నాయ‌న్నారు.

వ‌న్ నేష‌న్ వ‌న్ మార్కెట్ వ‌ల్ల ద్రవ్యోల్బణం అదుపులో ఉంద‌న్నారు.

ఉన్నత విద్యాభ్యాసం కోసం మ‌హిళ‌ల సంఖ్య పెరిగింద‌న్నారు.

25 కోట్ల మంది పేద‌రికం నుంచి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు ఆమె వెల్లడించారు

★ జీడీపీకి ప్రభుత్వం కొత్త అర్థం

జీడీపీ అంటే గవర్నెన్స్‌, డెవలప్‌మెంట్‌ పెర్ఫార్మెన్స్‌ అని కొత్త అర్థం ఇచ్చామన్నారు. పదేళ్లలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచామన్నారు.