Home > GENERAL KNOWLEDGE > DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 1st

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 1st

DAILY G.K. BITS IN TELUGU FEBRUARY 1st

1) కాకతీయుల కాలంలో ప్రసిద్ధుడైన కవి కేతన సంస్కృతంలోని ఏ గ్రంధాన్ని తెలుగులోకి అనువదించి ‘అభినవ దండి’ అని బిరుదును పొందాడు.?
జ : దశకుమార చరిత్ర

2) బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు దేనితో తయారుచేస్తారు.?
జ : సిలికాన్ నైట్రేట్ మరియు జనపనార

3) హరప్పా నాగరికత కాలంలో వర్ధిల్లిన హరప్పా నగరము ఏ నది ఒడ్డున ఉంది.?
జ : రావి

4) గౌతమ బుద్ధుడు ఎక్కడ పరమపదించాడు.?
జ : కుశీ నగరం

5) ఏ హిమాలయాలలో ఎవరెస్ట్ పర్వతం నెలకొని ఉన్నది?
జ : కేంద్ర హిమాలయాలలో

6) భారత ప్రభుత్వం 1955లో అధికార బాషా సంఘాన్ని నియమించింది దాని అధ్యక్షులు ఎవరు.?
జ : బి.జి. ఖేర్

7) భారతదేశంలో మనం మొట్టమొదట సూర్యోదయాన్ని ఎక్కడ చూస్తాం.?
జ : అరుణాచల్ ప్రదేశ్ లోని డాంగ్ ప్రాంతంలో

8) ఎరువుగా వాడబడే అమోనియం మిశ్రమం ఏది?
జ : అమోనియం ఫాస్పేట్

9) భారత జాతీయ కాంగ్రెస్ కు గాంధీజీ ఎన్నిమార్లు అధ్యక్షునిగా ఉన్నారు.?
జ : ఒక్కసారి మాత్రమే

10) బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ స్థాపకులు ఎవరు?
జ : సర్ విలియం జోన్స్

11) బుద్ధ చరితం గ్రంధకర్త ఎవరు?
జ : అశ్వ ఘోసుడు

12) న్యూట్రాన్ లతో పేల్చివేస్తే ఉత్పత్తి అయ్యే అణ ఇంధనం ఏది?
జ : యురేనియం – 233

13) రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో నిర్మించారు.?
జ : జర్మనీ

14) కృత్రిమ పట్టు అని దేనికి పేరు.?
జ : రేయాన్

15) హెపటైటిస్ అనే వ్యాధి ఏ అవయవానికి సంబంధించినది.?
జ : కాలేయము

16) నోబెల్ శాంతి బహుమతి అందుకున్న ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎవరు?
జ : నార్మన్ బోర్లాగ్

17) కుంకుమపువ్వు చెట్టు యొక్క ఏ భాగం నుండి కుంకుమ పువ్వును సేకరించెదరు.?
జ : కీలాగ్రము

18) సిమెంట్ నీళ్లు తగలడంతో గట్టిపడే ప్రక్రియలో ఉన్న సూత్రము ఏమిటి.?
జ : జల సంకలన చర్య మరియు జల విశ్లేషణ చర్య

19) రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు.?
జ : రాష్ట్ర ప్రభుత్వము

20) వృద్ధత్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం పేరు ఏమిటి?
జ : జెరంటాలజీ