UGC NEWS : ఒప్పంద అధ్యాపకుల సంఖ్యపై యూజీసీ పరిమితి సడలింపు

హైదరాబాద్ (ఎప్రిల్‌ – 27) : స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న (అటానమస్) కళాశాలలు గరిష్ఠంగా ఎంతమంది ఒప్పంద అధ్యాపకులను తీసుకోవచ్చనే విషయంలో పరిమితిని UGC సడలించింది. మంజూరైన మొత్తం బోధన సిబ్బంది సంఖ్యలో వీరు 10% మించకూడదనే నిబంధనను సవరించింది.

కళాశాలలు విద్యాపరమైన, పరిపాలనతో ముడిపడ్డ అటానమీని పొందడానికి తమ మాతృ విశ్వవిద్యాలయం ద్వారా కాకుండా నేరుగా యూజీసీని సంప్రదించే వెసులుబాటును కల్పించింది. యూజీసీ వెబ్సైట్ లో ఉండే దరఖాస్తును మాతృ విశ్వవిద్యాలయం ఆన్లైన్ లో పరిశీలించి, 30 పనిదినాల్లో సిఫార్సులు పంపించాల్సి ఉంటుంది. ఈ మేరకు నియంత్రణల నూతన నిబంధనల్ని యూజీసీ ప్రకటించింది.