హైదరాబాద్ (మార్చి – 19) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ (TSPSC PAPER LEAK) కారణంగా అనేక పరీక్షలను రద్దు చేస్తూ.. కొన్నింటిని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేపర్ లీక్ విషయంలో నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేయగా… సిట్ తో దర్యాప్తు ప్రారంభమైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రద్దైన, వాయిదా పడిన పరీక్షల వివరాలు… ఆరు పరీక్షలు రద్దు కాగా జేఎల్ పరీక్ష వాయిదా పడింది.
★ గ్రూప్ 1 ప్రిలిమ్స్ :
503 గ్రూప్ – 1 ఉద్యోగాల భర్తీ కోసం అక్టోబర్ 16 – 2023న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు. మెన్స్ షెడ్యూలు కూడా విడుదలైన ఈ పరీక్ష రద్దు చేయడంతో మరల ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 11వ తేదీన నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు.
★ జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ వాయిదా:
1, 392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు జనవరి 10న నోటిఫికేషన్ విడుదల చేసింది. టీఎస్పీఎస్సీ. జూన్ లేదా జులైలో ఆ పరీక్ష నిర్వహించే అవకాశం ఉండేది. అయితే, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ ని వాయిదా వేశారు. పేపర్ చెట్టును కూడా మార్చే అవకాశం ఉంది
★ ఏఈ పరీక్షలు :
833 ఏఈ పోస్టులకు 50వేల మంది అప్లై చేస్తుకున్నారు. మార్చి 5, 2023 న జరిగిన ఈ పరీక్షల్ని విజయవంతంగా పూర్తి చేశారు. అయితే, ఈ పరీక్ష క్వశ్చన్ పేపర్ కూడా లీక్ నేపథ్యంలో ఏఈ పరీక్షను రద్దు చేశారు.
★ టౌన్ ప్లానింగ్ :
టౌన్ ప్లానింగ్ అప్లికేంట్లకు నిరాశే మిగిలింది. ఈ పరీక్షల కోసం అక్టోబర్ 13, 2022 దరకాస్తు మొదలయింది. 175 పోస్టుల భర్తీకి 55,000 మంది అప్లై చేశారు. అయితే ఈ ఎగ్జామ్ డేట్ ప్రకటించే లోపే పేపర్ లీక్ అయి, టౌన్ ప్లానింగ్ పరీక్షను రద్దు చేశారు.
★ MVI పరీక్షలు :
మోటార్ వెహికిల్ ఇనిస్పెక్టర్ ఎగ్జామ్ నోటిఫికేషన్ జనవరి 12 న వచ్చింది. ఈ జాబ్ లో 113 వేకెన్సీలు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వల్ల ఈ పరీక్షను కూడా రద్దు చేశారు.
★ AEE పరీక్ష రద్దు:
జనవరి 1,2023 న జరిగిన ఏఈఈ (అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) పరీక్ష జరగింది. 1,540 పోస్టుల భర్తీకి 81,548 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఏఈఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
★ DAI పరీక్ష :
డివిజినల్ అకౌంట్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్షను కూడా టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. 53 పోస్టుల భర్తీకి 1,06,253 మంది అభ్యర్థులు దరకాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష ఫిబ్రవరి 26,2023న జరిగింది.