హైదరాబాద్ (మే – 08) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీకేజీ అంశం కారణంగా ఉద్యోగాల భర్తీకి కంప్యూటర్ ఆధారిత ఆధారిత రాతపరీక్ష (CBRT MOCK TEST BY TSPSC) నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో టీఎస్ పీఎస్సీ. తన వెబ్సైట్లో (CBRT MODEL EXAM by MOCK TEST ) నమూనా పరీక్షను సిద్ధం చేసింది. ఇందుకోసం లింకును అందుబాటులోకి తీసుకువచ్చింది. నోటిఫికేషన్ల పరీక్షలు ఆన్లైన్లో నిర్వహించే సీబీఆర్డీ పరీక్షలపై ఉద్యోగార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది.
ప్రశ్నలకు సమాధానం గుర్తించే విధానం, సూచనలు పొందుపరిచింది. ప్రశ్నపత్రం కోడ్, నోటిఫికేషన్ నంబరు, ప్రశ్నల సంఖ్య, మార్కులు, సమయం.. ప్రత్యక్షమవుతాయి. లాగిన్ అయిన తరువాత పూర్తయ్యేందుకు మిగిలిన సమయం కనిపిస్తుంది. స్క్రీన్ పొ ఒకసారి ఒక ప్రశ్న మాత్రమే కనిపిస్తుంది. ప్రశ్న భాషను తెలుగు నుంచి ఇంగ్లిష్ లోకి మార్చుకునేందుకు వీలుగా ఉందని వివరించింది. ఏదైనా సాఫ్ట్వేర్, హార్డ్వేర్ వచ్చినపుడు అభ్యర్థులు విషయాన్ని పరీక్ష కేంద్ర దృష్టికి తీసుకురావాలని, ఆ సమస్య పరి తరువాత అదనపు సమయం కంప్యూటర్ ఆటోమేటిక్ గా ఇస్తుందని వివరించింది.