హైదరాబాద్ (సెప్టెంబర్ – 03) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ (tspsc all notifications status ) చేసింది.. వీటిలో కొన్ని పరీక్షలను పూర్తి చేసి… కొన్ని పరీక్షల ప్రాథమిక కీ లు, ఫైనల్ కీ లు విడుదల చేసి .. ఫలితాల కోసం సన్నద్ధంగా ఉంది. అలాగే కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఏఏ నోటిఫికేషన్ ఏఏ దశలలో ఉందో చూద్దాం…
★ సెప్టెంబర్ లో TSPSC పరీక్షలు
- పాలిటెక్నిక్ లెక్చరర్ – సెప్టెంబర్ 4 – 8 వరకు పరీక్షలు
- జూనియర్ లెక్చరర్: సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 03 వరకు పరీక్షలు
- ఫిజికల్ డైరెక్టర్ – సెప్టెంబర్ 11న పరీక్ష
★ వివిధ నోటిఫికేషన్ ల ప్రస్తుత స్థితి
- అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (1,540) – ఫలితాలు వెల్లడించాల్సి ఉంది
- అగ్రికల్చరల్ ఆఫీసర్ (148) – తుది కీ విడుదల కోసం కసరత్తు
- లైబ్రేరియన్ (71) – తుది కీ విడుదల కోసం కసరత్తు
- డ్రగ్ ఇన్స్పెక్టర్ (18) – తుది కీ విడుదల కోసం కసరత్తు
- గ్రూపు వన్ ప్రిలిమ్స్ (503) – తుది కీ వెల్లడించారు. న్యాయ వివాదాలు
- హార్టికల్చర్ ఆఫీసర్ (22) – తుది కీ విడుదల కోసం కసరత్తు
- అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (113) – తుది కీ విడుదల కోసం కసరత్తు
- గ్రూప్ – 4 (8, 039) – ప్రాథమిక కీ పై అభ్యంతరాల స్వీకరణ
- టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ (175) – తుది కీ విడుదల కోసం కసరత్తు
- వెటర్నరీ సర్జన్ (185) – తుది కీ విడుదల కోసం కసరత్తు
- భూగర్భ జల శాఖ అధికారులు (32) – తుది కీ విడుదల కోసం కసరత్తు
- భూగర్భ జల శాఖ నాన్ గెజిటెడ్ అధికారులు (25) – తుది కీ విడుదల కోసం కసరత్తు
- అకౌంట్స్ ఆఫీసర్ (78) – తుది కీ విడుదల కోసం కసరత్తు
- అసిస్టెంట్ ఇంజనీర్లు (833) : అక్టోబర్ లో పరీక్షలు