BIKKI NEWS (MAY 18) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే ఒక పెండింగ్ డీఏ విడుదల (ts govt employees get one DA soon) చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. జూన్ 2 తర్వాత ఈ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
సీఎంవో కార్యదర్శి శేషాద్రితో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం నేతల భేటీలో డీఏ, బదిలీలు, పదోన్నతులు తదితర అంశాలపై హామీ లభించిందని సమాచారం.
ప్రస్తుతం ఉద్యోగులకు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. జూలై తర్వాత మరో డీఏ కూడా కలిస్తే ఐదవుతాయి. అయితే, ప్రభుత్వం తొలుత ఒక డీఏ ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం.
అలాగే ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. సాదరణ బదిలీలు, మెడికల్ బిల్లులు, ఇతర సర్వీసు సంబంధిత అంశాలను పరిష్కరించనున్నట్లు సమాచారం.