TS EdCET 2024 నోటిఫికేషన్ విడుదల

BIKKI NEWS (MAR. 04) : TS EdCET 2024 NOTIFICATION – తెలంగాణ రాష్ట్రంలో 2024 – 25 విద్యా సంవత్సరంలో రెండు సంవత్సరాల బీఈడీ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే టీఎస్ ఎడ్‌సెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌కు సంబంధించిన నోటిఫికేషన్ ను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుద‌ల చేసింది.

TS EdCET 2024 NOTIFICATION

మార్చి 4వ తేదీన టీఎస్ ఎడ్‌సెట్‌-2024 నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఎడ్‌సెట్ క‌న్వీన‌ర్ ప్రొఫెస‌ర్ మృణాళిని వెల్ల‌డించారు.

మార్చి 6వ తేదీ నుంచి మే 6వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చు. 250/- ఆల‌స్య రుసుం మే 13వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

దరఖాస్తు ఫీజు : 750/- (SC, ST, దివ్యాంగులకు – 550/- )

TS EdCET EXAM మే 23 తేదీన కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో రాత‌ప‌రీక్ష నిర్వ‌హించనున్నారు.

వెబ్సైట్ : https://edcet.tsche.ac.in