DSC 2024 – డీఎస్సీ దరఖాస్తు ఎడిట్‌ ఆప్షన్‌

BIKKI NEWS (MARCH 07) : తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తులను ఎడిట్‌ చేసుకునే అవకాశాన్ని (TS DSC 2024 APPLICATION EDIT OPTION) విద్యాశాఖ కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు కూడా తమ దరఖాస్తులను సవరించుకునే అవకాశాన్నిచ్చింది. కింద ఇవ్వబడిన లింక్ ద్వారా ఎడిట్ చేసుకోవచ్చు.

గతంలో తమ సొంత జిల్లాల్లో పోస్టులు లేకపోవడంతో చాలా మంది ఇతర జిల్లాల్లో ఓపెన్‌ కోటా ఉద్యోగాల కోసం దరఖాస్తులు సమర్పించారు. తాజాగా 11 వేల పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించడంతో కొన్ని జిల్లాల్లో పోస్టుల సంఖ్య పెరిగింది. వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్టుగా చూపిస్తున్నది.

ఈ నేపథ్యంలో ఎడిట్‌ ఆప్షన్‌ ఇవ్వాలని అభ్యర్థులు కోరగా, విద్యాశాఖ ఈ అవకాశాన్నిస్తూ వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. కావునా గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నూతన పోస్టులను బట్టి వేరే జిల్లాలలో కూడా ఎడిట్ ఆఫ్షన్ ద్వారా దరఖాస్తులో మార్పులు చేసుకోవచ్చు.

TS DSC EDIT OPTION LINK