DSC NOTIFICATION 2024 – డిఎస్సీ పూర్తి నోటిఫికేషన్ & దరఖాస్తు లింక్

BIKKI NEWS (MARCH 04) : TELANGANA DSC NOTIFICATION 2024 & APPLICATION LINK – తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ 11,062 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ 2024 ను విడుదల చేసింది. గతంలో ఉన్న నోటిఫికేషన్ ను రద్దు చేసి మరిన్ని పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మరల దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు గడువు : జూన్ – 20 -2024 వరకు

అర్హతలు : పోస్టును అనుసరించి కలవు (పూర్తి నోటిఫికేషన్ లో చూడగలరు)

వయోపరిమితి : 18 – 46 సంవత్సరాల మద్య (రిజర్వేషన్లు ఆధారంగా సడలింపు కలదు)

దరఖాస్తు ఫీజు : 1,000/-

పరీక్షల షెడ్యూల్ : జూలై 17నుంచి 30వ తేదీ వరకు

పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF

దరఖాస్తు లింక్ : APLLY HERE

TS DSC SCHEME OF VALUATION

100 మార్కులకు ఈ పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్దతిలో నిర్వహిస్తారు. 20 మార్కులకు TET/ CTET మార్కులను వెయిటేజ్ గా ఇస్తారు. మిగతా 80 మార్కులకు 160 ప్రశ్నలు ఇస్తారు.

★ ఖాళీల వివరాలు :

సెకండరీ గ్రేడ్ టీచర్ – 6,508,
స్కూల్ అసిస్టెంట్ – 2,629,
భాషా పండితులు – 727,
పీఈటీ లు – 182 పోస్టులు కలవు.

★ ప్రత్యేక కేటగిరీలో

సెకండరీ గ్రేడ్ టీచర్ – 796,
స్కూల్ అసిస్టెంట్ – 22

TS DSC 2024 – జిల్లాల వారీగా & రిజర్వేషన్లు వారీగా ఖాళీల వివరాలను కింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

DSC 2024 VACANCIES DISTRICT and RESERVATION WISE LIST

★ TS DSC POST WISE SYLLABUS

SGT SYLLABUS

SA (ALL SUBJECTS) SYLLABUS

PET SYLLABUS

LANGUAGE PANDIT SYLLABUS

వెబ్సైట్ : https://tsdsc.aptonline.in/tsdsc/