BIKKI NEWS (NOV. 30) : TODAY NEWS IN TELUGU on 30th NOVEMBER 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 30th NOVEMBER 2024
TELANGANA NEWS
నేడు 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ – సీఎం
అత్యంత నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ళు – సీఎం
అత్యంత వేగంగా బిల్డింగ్ నిర్మాణం పనుల అనుమతులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.
2024 జులై సెప్టెంబర్ త్రైమాసికంలో తెలంగాణలో నిరుద్యోగ శాతం 18.1% అని కేంద్రం ప్రకటించింది
తెలంగాణలో చలితీవ్రత క్రమంగా పెరుగుతున్నది. 7 జిల్లాల్లో 10 డిగ్రీల్లోపే ఉష్ణోగ్రతలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహించనున్న ‘ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాలు’ కార్యక్రమాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పత్తి ఏరుతున్న మహిళపై పులి దాడి చేసి చంపిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం గన్నారంలో శుక్రవారం జరిగింది.
సీపీఎస్‌ను రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఏకీకృత పింఛన్ పథకాన్ని అంగీకరించబోమని ఆయన స్పష్టం చేశారు.
గిరిజన సంక్షేమ శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని లంబాడా హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది.
రాష్ట్రంలో న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ పాలసీని(కొత్త పునరుజ్జీవ ఇంధన విధానం) రూపొందిస్తున్నట్టు తెలిపింది.
ANDHRA PRADESH NEWS
ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్
విద్యుత్ చార్జీల పెంపు ద్వారా 9412 కోట్ల వసూళ్లకు ఏపీఈఆర్‌సీ అనుమతి.
తెలంగాణ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో గుంటూరు జిల్లా కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ నేరం నిరూపించలేకపోయిందని పేర్కొన్న న్యాయస్థానం కేసును కొట్టివేసింది.
ఏపీలో కూటమిపై వ్యతిరేకత మొదలైంది.. ప్రజల తరఫున పోరాటం చేయాలని శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు
సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్లు జగన్ తెలిపారు. ప్రతి బుధ, గురువారాలు జగన్ కార్యకర్తలతోనే గడపనున్నారు
కాకినాడ పోర్టులో పవన్‌కల్యాణ్ తనిఖీలు.. అధికారుల వ్యవహారంపై మండిపాటు.. ఎమ్మెల్యేకు చురకలు
NATIONAL NEWS
యూపీలోని సంభల్‌లో చెలరేగిన హింస, అదానీ అవినీతి తదితర అంశాలపై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యక్రమాలకు శుక్రవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఒక పక్క బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నవీసే కాబోయే సీఎం అని అనధికార ప్రచారం జరిగినా దానిని అధికారికంగా ఎవరూ ధ్రువీకరించ లేదు
కేవలం పెండ్లికి నిరాకరించడం ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
భారత్, శ్రీలంక నేవీలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రెండు చేపల వేట పడవల నుంచి 500 కిలోల క్రిస్టల్ మెథాంఫెటమిన్‌ను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు.
ప్రతి వెయ్యి మందికి ఒక వైద్యుడు ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పిందని, మన దేశంలో ప్రతి 811 మందికి ఒక వైద్యుడు ఉన్నారని మంత్రి జేపీ నడ్డా చెప్పారు.
దేశంలో జన్యుమార్పిడి (జీఎం) విత్తనాలపై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ ప్రధాని మోదీకి రైతు నేత రాకేశ్ టికాయత్ లేఖ రాశారు.
యూనివర్శిటీ ఛాన్సలర్‌గా గవర్నర్ బదులు సీఎం.. కర్ణాటక క్యాబినెట్ ఆమోదం
INTERNATIONAL NEWS
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ భద్రతకు ముంపు ఉందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అనుమానం చేశారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి ట్రంప్ తో చర్చ కు సిద్ధం అని తెలిపారు.
మెర్కల్‌తో జరిగిన మీటింగ్‌కు పుతిన్ తన పెంపుడు కుక్కను తీసుకొచ్చారు. 17 ఏళ్ల క్రితం జరిగిన ఆ ఘటన తనను ఇబ్బందిపెట్టినట్లు ఇటీవల ఓ బుక్‌లో మెర్కల్ రాశారు. అయితే ఆ ఘటన పట్ల పుతిన్ ఇవాళ క్షమాపణలు చెప్పారు.
చిన్మయి కృష్ణదాస్ బ్యాంక్ ఖాతాను నిలిపేసిన బంగ్లాదేశ్
BUSINESS NEWS
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
సెన్సెక్స్ : 79,802.79 (759.05)
నిఫ్టీ : 24,131.10 (216.95)
రూపాయి డాలర్ తో పోల్చితే 13 పైసలు పడిపోయి మునుపెన్నడూ లేనివిధంగా భారతీయ కరెన్సీ 84.60 వద్దకు క్షీణించింది.
ఈ నెల 22తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 1.31 బిలియన్ డాలర్లు తగ్గి 656.582 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ తన వారాంతపు సమీక్షలో వెల్లడించింది.
జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వివరాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో జీడీపీ 5.4 శాతానికే పరిమితమైంది.
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం తులం బంగారం (24 క్యారట్స్) ధర రూ.700 వృద్ధితో రూ.79,400 పలికింది.
SPORTS NEWS
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ 4వ గేమ్ డ్రా గా ముగిసింది. దీంతో చెరో 2 పాయింట్లతో ఉన్నారు.
లక్నోలో జరుగుతున్న సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు సెమీఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.
EDUCATION & JOBS UPDATES
అక్టోబర్ వరకు జాతీయంగా సెంట్రల్ యూనివర్సిటీ లలో 5,182 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది.
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎం టి ఎస్ పరీక్ష కీని విడుదల చేసింది.
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి
- LIC SCHOLARSHIP – 40 వేల రూపాయల ఎల్ఐసీ స్కాలర్షిప్
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 08 – 12 – 2024
- GK BITS IN TELUGU 8th DECEMBER