BIKKI NEWS (AUG 30) : TODAY NEWS IN TELUGU on 30th AUGUST 2024
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…
TODAY NEWS IN TELUGU on 30th AUGUST 2024
TELANGANA NEWS
హైదరాబాద్ తొలినుంచి మతసామరస్యానికి, ప్రశాంతతకు మారు పేరని, దాన్ని మరింత ఇనుమడింపజేసేలా గణేశ్ ఉత్సవాలను నిర్వహించాలని ఉత్సవ కమిటీలు, మండప నిర్వాహకులు, అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
మండప నిర్వాహకులు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. మండపాలకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలన్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారు
సెప్టెంబరు 19న మిలాద్-ఉన్-నబీ ప్రదర్శనలు నిర్వహించుకునేందుకు మిలాద్ కమిటీ ప్రతినిధులు అంగీకరించారు
ఆహార పంటల ఉత్పత్తిలో తెలంగాణ మేటిగా నిలిచింది. ఏకంగా 16.42 శాతం వృద్ధి రేటును సాధించిన తెలంగాణ దేశంలోనే అగ్రభాగాన ఉన్నది.
హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు – సీఎం
జిల్లా పరిషత్‌లలో పని చేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేని డిమాండ్ చేశారు.
హైడ్రాను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ఆలోచనలో ఉన్నామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు
ఆక్రమణల తొలగింపునకు సంబంధించి హైడ్రాకు మరిన్ని అధికారాలు అప్పగించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
ఎమ్మెల్సీ కవిత బెయిల్ విషయంలో అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును తప్పు పడ్తారా? అంటూ తీవ్రస్థాయిలో మండిపడింది.
బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ప్రతిష్టాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్ అవార్డు అందుకున్నారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టలబేగం ప్రాంతంలో దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్ ఏరియాలో నిర్మాణాల తొలగింపునకు ఇచ్చిన నోటీసులను షోకాజ్ నోటీసులుగా పరిగణించాలని హైకోర్టు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది
ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల సాలర్‌షిప్‌ల విషయంలో రేవంత్‌రెడ్డి సరార్ నిర్లక్ష్యం వహిస్తున్నదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అనుమతులు ఇచ్చిన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు ఆయా ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
తెలంగాణలో ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
ANDHRA PRADESH NEWS
వైసీపీ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు తమ రాజీనామా పత్రాలు సమర్పించారు.
తిరులమ శ్రీవారి ఆలయం తరహాలోనే తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని టీటీడీ ఈవో జే శ్యామలరావు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం విధానం రూపకల్పనకు కేబినెట్ సబ్‌కమిటీ ని ఏర్పాటు చేసింది.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా 1వ తేదీనాడే పింఛన్లు అందజేయనుండగా ఈసారి ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
NATIONAL NEWS
పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన దిశగా అడుగులు పడుతున్నాయా? ఇటీవలి వరుస పరిణామాలు ఈ ఊహాగానాలను బలపరుస్తున్నాయి. కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన తర్వాత రాష్ట్రంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ముడా భూకేటాయింపు కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను విచారించేందుకు అనుమతించడం గవర్నర్ స్వతంత్ర నిర్ణయమని, దీనిపై మంత్రివర్గ సూచనతో వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాటలోనే కర్ణాటక కాంగ్రెస్ సర్కారు నడుస్తున్నది. సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించాలని సిద్ధరామయ్య సర్కారు నిర్ణయించింది.
ముస్లింల వివాహ, విడాకుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండింటి నమోదును తప్పనిసరి చేస్తూ అస్సాం శాసనసభ గురువారం బిల్లును ఆమోదించింది.
అణ్వస్త్ర సామర్థ్యమున్న ‘ఐఎన్‌ఎస్ అరిఘాత్’ నేవీ అమ్ములపొదిలోకి చేరింది. ఏపీలోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో జలాంతర్గామిని ప్రారంభించారు
క్రీడా దినోత్సవం సందర్భంగా రాహుల్ కీలక ప్రకటన.. త్వరలో భారత్ డోజో యాత్ర
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.
జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతం
INTERNATIONAL NEWS
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్‌కు ప్రధాని మోదీని పాకిస్థాన్ ఆహ్వానించింది. అక్టోబర్‌లో ఈ సమావేశాలు జరగనున్నాయి. పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయం ఇవాళ ఈ విషయాన్ని ప్రకటించింది.
కాంగోలో మంకీ పాక్స్ కేసులు ఇప్పటి వరకు 18వేల మందికి పైగా రికార్డయ్యాయి. ఇందులో కనీసం 610 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రకటించారు.
BUSINESS NEWS
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. బ్లూచిప్ సంస్థల ర్యాలీతో సూచీలు మరో శిఖరానికి చేరుకున్నాయి
సెన్సెక్స్ : 82,135 (349)
నిఫ్టీ : 25,152 (100)
జియో వినియోగదారులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏఐ క్లౌడ్ వెల్‌కమ్ ఆఫర్‌ను ప్రకటించారు. ఇందులోభాగంగా జియో యూజర్లు 100జీబీదాకా ఉచిత క్లౌడ్ స్టోరేజీని పొందే అవకాశాన్ని కల్పించారు.
రిలయన్స్ ఈక్విటీ షేర్ హోల్డర్లకు 1:1 శ్రేణిలో బోనస్ షేర్లను ఇవ్వాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భావిస్తున్నది. ఈ అంశాన్ని సంస్థ బోర్డు సెప్టెంబర్ 5న పరిశీలించనున్నది.
లగ్జరీ జ్యుయెల్లరీ సెగ్మెంట్‌లోకి అడుగు పెట్టాలని యోచిస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు
2024 సంవత్సరానికిగాను హురూన్ ఇండియా విడుదల చేసిన సంపన్నవర్గాల జాబితాలో 11.6 లక్షల కోట్ల సంపదతో దేశీయ కుబేరుడు అదాని, రెండో స్థానంలో అంబానీ
జెప్టో.. ఓ క్విక్ కామర్స్ స్టార్టప్ సంస్థ.. దీని సహ వ్యవస్థాపకులు కైవల్య వోహ్రా.. 2024 హురున్ ఇండియా సంపన్నుల్లో యువ పారిశ్రామిక వేత్తల జాబితాలో మొదటి స్థానంలో నిలిచారు.
SPORTS NEWS
ప్రతిష్ఠాత్మక పారిస్ పారాలింపిక్స్‌లో భారత్ శుభారంభం చేసింది.
ఆర్చరీ మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్‌లో శీతల్‌దేవి 703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో మరో ఆర్చర్ సరితాదేవి(682) తొమ్మిదో స్థానం దక్కించుకుంది.
మిక్స్‌డ్ టీమ్ కాంపౌండ్ ఆర్చరీ ఈవెంట్‌లో శీతల్‌దేవి, ఆర్ కుమార్ ద్వయం ప్రపంచ రికార్డు(1399) స్కోరుతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు.
భారత షట్లర్లు అదరగొట్టారు. వ్యక్తిగత విభాగంలో ఎనిమిది షట్లర్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధించారు.
కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ రేసులో ఉన్న దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్‌లో మూడో రౌండ్‌కు చేరాడు.
ఈ ఏడాది అక్టోబర్‌లో భారత పర్యటనకు రానున్న న్యూజిలాండ్ జట్టుకు కొత్త బౌలింగ్ కోచ్ వచ్చాడు. ఆ దేశ మాజీ పేసర్ జాకబ్ ఓరమ్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించింది.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ శతక గర్జన చేశాడు. తనకెంతో ఇష్టమైన లార్డ్స్ స్టేడియంలో శ్రీలంక బౌలర్లను ఎదుర్కొంటుఉ 33వ సెంచరీ నమోదు చేశాడు
ఐపీఎల్‌లో చెరగని ముద్ర వేసిన 11 మందితో టీమ్‌ను అశ్విన్ వెల్లడించాడు. అశ్విన్ ఎంపిక చేసిన ఆల్ టైమ్ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.
దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
EDUCATION & JOBS UPDATES
నూతన జాతీయ విద్యా విధానం కింద తొలి విదేశీ విశ్వవిద్యాలయం ఆఫ్‌షోర్ క్యాంపస్ గురుగ్రామ్‌లో ఏర్పాటు కాబోతున్నది. బ్రిటన్‌కు చెందిన సౌతాంప్టన్ వర్సిటీ దీనిని ఏర్పాటు చేస్తుందని కేంద్రం గురువారం తెలిపింది.
మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ జంజాటం.. ఇంటర్‌బోర్డు గుర్తింపునివ్వకపోవడం వంటి సమస్యలతో 340కి పైగా కాలేజీల్లోని విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుంది
మెడికల్ అడ్మిషన్ లో స్థానికత పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది.
జేఎన్టీయూ హైదరాబాద్లో ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం
మనూ యూనివర్సిటీలో సివిల్స్ కు ఉచిత శిక్షణ అందించనున్నారు
ENTERTAINMENT UPDATES
కన్నడ నటుడు దర్శన్ తూగుదీపను పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి బళ్లారి జైలుకు గురువారం తరలించారు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కూలీ’. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగార్జున అతిథి పాత్రలో (సైమన్) నటిస్తున్నారు.
హురున్ రిచ్ లిస్టులోకి షారూక్ ఎంట్రీ ఇచ్చారు. ఆయన సంపద రూ.7300 కోట్లు. యాక్టింగ్ కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా నడవడం. అతనికి చెందిన కోల్‌కతా జట్టు.. తాజాగా ఐపీఎల్ నెగ్గడం వల్ల షారూక్ సంపద పెరిగింది.