Home > LATEST NEWS > TODAY NEWS > TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 15 – 11 – 2024

TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 15 – 11 – 2024

BIKKI NEWS (NOV. 15) : TODAY NEWS IN TELUGU on 15th NOVEMBER 2024

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ, వాణిజ్య, క్రీడా, సినిమా, విద్యా – ఉద్యోగ సమాచారంతో కూడిన వార్తల సమాహారం సంక్షిప్తంగా మీకోసం…

TODAY NEWS IN TELUGU on 15th NOVEMBER 2024

TELANGANA NEWS

తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజినల్‌ జాబితాను టీజీపీఎస్సీ గురువారం రాత్రి ప్రకటించింది.

రాష్ట్ర వ్యాప్తంగా 26,854 ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో 26 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే 11వేలకు పైగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 36 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారని సీఎం తెలిపారు.

అది పోలీసులు అల్లిన కట్టుకథ.. ఆరోపణలన్నీ అవాస్తవం: మాజీ ఎమ్మెల్యే పట్నం

మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్‌ క ళాశాలలో జూనియర్‌ వైద్యవిద్యార్థులను సీనియర్లు ర్యాగింగ్‌ చేసినందుకుగానూ 2023 బ్యాచ్‌కు చెందిన 10 మందిని సస్పెండ్‌ చేశారు.

తెలంగాణ ప్రజల కోసం వందసార్లయినా జైలుకెళ్తా.. ప్రజలు, రైతుల కోసం అన్నింటికీ సిద్ధంగా ఉన్నా..

ANDHRA PRADESH NEWS

కూటమి ఇచ్చిన హామీల అమలుపై ఖచ్చితంగా పోస్టులు పెడతాం : మాజీ మంత్రి రోజా

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల భద్రతను గాలికొదిలేసిన కూటమి : విజయసాయి రెడ్డి

విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రద్దు చేసిన ఎన్నికల సంఘం

ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామకృష్ణరాజు ఏకగ్రీవ ఎన్నిక

NATIONAL NEWS

దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం కమ్మేసింది. 300 విమానాల రాకపోకలు ఆలస్యం. ప్రాథమిక బడుల మూత.. వాహనాలపై ఆంక్షలు.

భారత దేశ రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలో గైడెడ్‌ పినాక ఆయుధ వ్యవస్థ ప్రయోగ పరీక్షను గురువారం విజయవంతంగా నిర్వహించారు.

రాజకీయ నేతలు చేస్తున్న రెచ్చగొట్టే ప్రసంగాలను అడ్డుకోవాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మంగళవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది.

గురువారం హోరాహోరీగా జరిగిన ఢిల్లీ నగర మేయర్‌ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ బీజేపీపై విజయం సాధించింది. 256 ఓట్లలో 133 ఓట్లు ఆప్‌ అభ్యర్థి మహేశ్‌ ఖిచికి లభించగా, ఆయన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కిషన్‌లాల్‌కు 130 ఓట్లు లభించాయి. రెండు ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు.

మధ్యప్రదేశ్‌లోని విజయ్‌పూర్‌ శాసన సభ స్థానం ఉప ఎన్నికల పోలింగ్‌ తర్వాత హింస చెలరేగింది. బుధవారం పోలింగ్‌ ముగిసిన తర్వాత గోహ్తా గ్రామంలోని దళితుల ఇండ్లకు దుండగులు నిప్పు పెట్టారు.

INTERNATIONAL NEWS

అమెరికా తదుపరి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా తులసి గబ్బర్డ్‌

భారత సంతతికి చెందిన షిఫాలీ జమ్వాల్‌ మిసెస్‌ యూనివర్స్‌ అమెరికా 2024 కిరీటాన్ని దక్కించుకున్నారు

భవిష్యత్తులో ఏర్పడే తీవ్ర వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 2015లో చేసుకున్న పారిస్‌ ఒప్పందాన్ని కొన్ని ధనిక, అభివృద్ధి చెందిన దేశాలు నిర్వీర్యం చేయడం పట్ల కాప్‌29 శిఖరాగ్ర సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది.

నిషేధిత ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ అధిపతిగా భావిస్తున్న ఉగ్రవాది అర్షదీప్ గిల్ అలియాస్ అర్ష్ దల్లాను అప్పగించాలని కెనడా ప్రభుత్వాన్ని భారత్ కోరింది.

బంగ్లాదేశ్‌ ఇస్లామిక్‌ దేశం దిశగా అడుగులు వేస్తున్నది. ఆ దేశ రాజ్యాంగం నుంచి ‘సెక్యులర్‌’ పదం తొలగింపునకు ప్రయత్నం జరుగుతున్నది.

ప్లుటోనియం బాంబుల‌ను ఉక్రెయిన్ డెవ‌ల‌ప్ చేస్తోంది. దీనిపై ఓ రిపోర్టు రిలీజైంది. నాగ‌సాకిపై అమెరికా వేసిన అణు బాంబు త‌ర‌హాలో.. చిన్న త‌ర‌హా అణు బాంబుల‌ను ఉక్రెయిన్ త‌యారు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

అమెరికా దేశాధ్య‌క్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌.. శ్వేత సౌధంలో ప్ర‌స్తుత అధ్య‌క్షుడు జో బైడెన్‌ను క‌లుసుకున్నారు. ఓవ‌ర్ ఆఫీసులో ఇద్ద‌రూ భేటీ అయ్యారు. అధికార మార్పిడి గురించి చర్చించుకున్నారు.

BUSINESS NEWS

నష్టాల బాటలోనే స్టాక్ మార్కెట్లు

సెన్సెక్స్ : 77,580 (-111)
నిఫ్టీ : 23,533 (-26)

రిలయన్స్ అనుబంధ వయాకాం18, గ్లోబల్ మీడియా సంస్థ వాల్డ్ డిస్నీ భారత్ యూనిట్ విలీన ప్రక్రియ ముగిసింది. రెండు సంస్థల జాయింట్ వెంచర్ విలువ రూ.70,352 కోట్లు ఉంటుంది.

అక్టోబర్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం 2.36 శాతంగా నమోదైనట్టు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొన్నది.

హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ తులం బంగారం ధర రూ.1,200 దిగి రూ.75,650కి తగ్గింది. అలాగే 22 క్యారెట్‌ ధర రూ.1,100 తగ్గి రూ.69,350గా నమోదైంది

దేశీయ వాణిజ్య ఎగుమతులు గత నెల అక్టోబర్‌లో నిరుడుతో పోల్చితే 17.25 శాతం పెరిగి రెండేండ్ల గరిష్ఠాన్ని తాకుతూ 39.2 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

వాణిజ్య లోటు 27.14 బిలియన్‌ డాలర్లకు పెరగడం గమనార్హం.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 7 పైసలు తగ్గి మునుపెన్నడు కనిష్ఠ స్థాయి 84.46కి పడిపోయింది

SBI మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్‌-బేస్డ్‌ లెండింగ్‌ రేటు(ఎంసీఎల్‌ఆర్‌)ని ఐదు బేసిస్‌ పాయింట్లు పెంచింది.

SPORTS NEWS

నేడు దక్షిణాఫ్రికా తో చివరి టీట్వంటీ ఆడనున్న టీమిండియా. ఇప్పటికే 2-1 తో ముందంజ.

బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ కోసం ఎదురుచూస్తున్న స్టార్‌ షట్లర్‌ పీవీ సింధుకు మరోసారి చుక్కెదురైంది. జపాన్‌ మాస్టర్స్‌ ప్రిక్వార్టర్స్‌లో ఆమె ఓటమిపాలైంది.

టాటా స్టీల్‌ చెస్‌ ర్యాపిడ్‌ టోర్నీలో ప్రపంచ నంబర్‌వన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నాడు.

మహిళల ఆసియా కప్‌ ఏషియన్‌ చాంపియన్స్‌ ట్రోఫీ (ఏసీటీ)లో భారత్‌ 13-0తో థాయ్‌లాండ్‌ను ఓడించి ఈ టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని నమోదు చేశారు.

అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన రంజీ ప్లేట్‌ గ్రూప్‌లో గోవా బ్యాటర్లు కశ్యప్‌ బాక్లే (300 నాటౌట్‌), స్నేహల్‌ కౌత్నకర్‌ (314 నాటౌట్‌) టోర్నీ చరిత్రలో రికార్డు భాగస్వామ్యాన్ని (606) నమోదుచేశారు.

EDUCATION & JOBS UPDATES

తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 8,084 మంది అభ్యర్థులతో ప్రొవిజినల్‌ జాబితాను టీజీపీఎస్సీ గురువారం రాత్రి ప్రకటించింది.

కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో అనుబంధ కళాశాలల్లో యూజీ, పీజీ ఆయుష్‌ కోర్సుల్లో (ఆయుర్వేద, యునాని, హోమియో) యాజమాన్య కోటాలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అధికారులు గురువారం ప్రకటనలో తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎంఈడీ, ఎంపీఈడీ సీట్ల చివరి దశ భర్తీకి షెడ్యూల్‌ విడుదల చేసినట్లు టీజీ సీపీజీఈటీ-2024 కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఐ. పాండురంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

డిగ్రీ కోర్సుల ఇన్‌స్టంట్‌ పరీక్షా రివాల్యుయేషన్‌ ఫలితాల విడుదల.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు