చరిత్రలో ఈరోజు నవంబర్ 03

★ సంఘటనలు

1956: పద్మజా నాయుడు పశ్చిమ బెంగాల్ గవర్నరుగా నియామకం.
1966: తుపాను ధాటికి పశ్చిమ బెంగాల్లో 1000 మంది మరణించారు.
1984: ప్రధాని ఇందిరా గాంధీ మరణానంతరం ఢిల్లీలో జరిగిన హింసాకాండలో 3000 మంది మరణించారు.

★ జననాలు

1688: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (మ.1743)
1874: మారేపల్లి రామచంద్ర శాస్త్రి, సాహితీవేత్త, సంఘ సంస్కర్త, నాటక రంగ ప్రముఖుడు. (మ.1951)
1878: బెంగుళూరు నాగరత్నమ్మ, గాయని, కళాకారిణి. (మ.1952)
1890: హీరాలాల్ జెకిసుందాస్ కనియా, భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి (మ. 1951)
1904: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత. (మ.1986)
1906: పృథ్వీరాజ్ కపూర్, హిందీ సినిమానటుడు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత. (మ.1972)
1925: ఏల్చూరి విజయరాఘవ రావు, భారతీయ సంగీతకారుడు, వేణుగాన విద్వాంసుడు, సంగీత దర్శకుడు, రచయిత. (మ.2011)
1933: అమర్త్యా సేన్, ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి స్వీకరించిన తొలి భారతదేశపు ఆర్థిక శాస్త్రవేత్త.
1935: ఇ.వి.సరోజ, 1950, 60 వ దశకాలకు చెందిన తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి. (మ.2006)
1936: రాయ్ ఎమర్సన్, ఆస్ట్రేలియాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు.
1937: జిక్కి, తమిళ, కన్నడ, మలయాళ, సింహళ, హిందీ భాషలలో సినీ గాయకురాలు. (మ.2004)
1940: పెండ్యాల వరవర రావు, విప్లవ రచయిత.
1949: అన్నా వింటర్, ఒక బ్రిటిష్-అమెరికన్ పాత్రికేయుడు, సంపాదకుడు.
1955: కాత్యాయని విద్మహే, అభ్యుదయ రచయిత్రి.
1956 : కోట రాజశేఖర్, ధార్మికోపన్యాసకులు. సంస్కృతభాషా ప్రచారకులు.
1963: పైడి తెరేష్ బాబు, కవి. (మ.2014)
1968: మణిబాల. ఎస్, రంగస్థల నటి.

★ మరణాలు

1998: పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. (జ.1935)
2022: కంచర్ల లక్ష్మారెడ్డి, తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్టు.
2022: జి.ఎస్. వరదాచారి, సినీ విమర్శకుడు, పాత్రికేయుడు (జ. 1932)