INDvsSL : టీమిండియా అతి భారీ విజయం

ముంబై (నవంబర్ – 02) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా టీమిండియా, శ్రీలంక (INDvsSL) జట్ల మద్య ఈరోజు జరిగిన మ్యాచ్ లో భారత్ అతి భారీ విజయం 302 పరుగల తేడాతో నమోదు చేసుకుంది. శ్రీలంక ను కేవలం 55 పరుగులకే ఆలౌట్ చేసింది. 14 పాయింట్లతో సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకున్న మొదటి టీమ్ గా నిలిచింది. ఈ వరల్డ్ కప్ లో భారత్ కి ఇది వరుసగా 7 విజయం కావడం విశేషం. వరుసగా 4వ సారి భారత్ వరల్డ్ కప్ సెమీస్ కు చేరింది.

శ్రీలంక కేవలం 29.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందులో 10 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో రావడం విశేషం.

భారత స్పీడ్ గన్స్ షమీ – 5, సిరాజ్ – 3, బుమ్రా – 2 ధాటికి సుడిగాలి మలో చిగురాటుకుల శ్రీలంక వణికింది. షమీ కి ఇది ఈ వరల్డ్ కప్ లో ఐదు వికెట్లు తీయడం రెండో సారి.భారత్ తరపున వరల్డ్ కప్ లలో అత్యధిక వికెట్లు (45*) తీసిన బౌలర్ గా మహ్మద్ షమీ జహీర్ ఖాన్ (44) రికార్డు ను బ్రేక్ చేశాడు.

మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 357/8 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. విరాట్ కోహ్లీ (88), శుభమన్ గిల్ (92), శ్రేయస్ అయ్యర్ (82) రాణించారు. ముగ్గురు బ్యాట్స్‌మన్ లు సెంచరీ మిస్ కావడం విశేషం.

శ్రీలంక బౌలర్లలో మధుశంక – 5, చమీరా – 1 వికెట్లు తీశారు. ఈ వరల్డ్ కప్ లో 5 వికెట్లు తీసిన నాలుగో బౌలర్ గా మధుశంక నిలిచాడు. ఇంతకుముందు షమీ, శాంట్నర్, ఆప్రిధి ఈ ఘనత సాదించారు.

విరాట్ కోహ్లీ ఒకే కేలండర్ ఇయర్ లో అత్యధిక సార్లు (8) 1,000 పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్‌మన్ గా రికార్డు సృష్టించాడు. సచిన్ 7 సార్లు రికార్డు ను అధిగమించాడు.

శ్రీలంక ఈ మ్యాచ్లో ఓడిపోతే దాదాపు సెమిస్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోయినట్లే. భారత్ ఇప్పటికే సెమీస్ చేరుకోగా… అధికారికంగా సెమీస్ క్వాలిఫై కావాలంటే ఈ మ్యాచ్ లో గెలిస్తే చాలు.

ఇప్పటికే ఈ ప్రపంచ కప్ లో టీమిండియా తాను ఆడిన 6 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌లలో నెగ్గి 2వ స్థానంలో ఉండగా, శ్రీలంక జట్టు తాను ఆడిన 6 మ్యాచ్ లలో 2 మ్యాచ్‌లలో గెలిచి పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది.