DAILY G.K. BITS IN TELUGU 3rd NOVEMBER
1) హరిత విప్లవం ప్రభావంతో అత్యధిక దిగుబడిని సాధించిన పంట ఏది?
జ : గోధుమ
2) 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యధికంగా పని భాగస్వామ్యపు రేటు ఉన్న రాష్ట్రం.?
జ : హిమాచల్ ప్రదేశ్
3) సుకన్య సమృద్ధి యోజన ఎప్పుడు ప్రారంభించారు.?
జ : జనవరి 22 2015
4) పట్టణీకరణకు స్వర్ణ యుగంగా పేరొందిన కాలం.?
జ : మొగల్ యుగం
5) ఆంగ్లేయుల ఆర్థిక విధానం గంగా ఒడ్డున ఉన్న సంపదనంతా పీల్చేసి థేమ్స్ ఒడ్డున కక్కే స్పాంజీ లాంటిది అని వ్యాఖ్యానించినది ఎవరు?
జ : సుమలీ వాన్
6) అక్బర్ సిస్తు విధించడానికి అనుసరించిన పద్ధతి.?
జ : దస్ సాలి
7) మధ్యయుగ ఆర్థిక వ్యవస్థను భూస్వామ్య ఆర్థిక వ్యవస్థ అని పేర్కొన్న తొలి భారతదేశ చారిత్రకారుడు ఎవరు.?
జ : ఆర్ఎస్ శర్మ
8) ఏ కేసులో ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల కంటే ఉన్నతమైనవి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.?
జ : మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు
9) భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్ష భావన అనేది.?
జ : పరోక్షంగా ప్రస్తావించారు – వివరించారు
10) ప్రాథమిక విధుల అమలు ఉల్లంఘనకు సంబంధించి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది.?
జ : జస్టిస్ జెఎస్ వర్మ కమిటీ
11) రాజ్యాంగం లోని ఏ ప్రకరణ షెడ్యూల్ ప్రాంతాలు గిరిజన ప్రాంతాల పరిపాలన కోసం ఒక ప్రత్యేక పాలన వ్యవస్థను ఏర్పాటు చేయాలని తెలుపుతోంది.?
జ : ప్రకరణ 244
12) గణతంత్ర రాజ్యం అనే భావనను భారత రాజ్యాంగ నిర్మాతలు ఏ రాజ్యాంగం నుండి గ్రహించారు.?
జ : ఫ్రెంచ్