చరిత్రలో ఈరోజు జూలై – 23

BIKKI NEWS : TODAY IN HISTORY JULY 23rd

TODAY IN HISTORY JULY 23rd

దినోత్సవం

  • ఈజిప్ట్ జాతీయదినోత్సవం.
  • ఇథియోపియా జాతీయదినోత్సవం
  • జాతీయ ప్రసార దినోత్సవం

సంఘటనలు

0636: బైజాంటైన్ సామ్రాజ్యం నుంచి అరబ్బులు పాలస్తీనా లోని చాలా భూభాగం మీద ఆధిపత్యం సాధించారు.
0685: కేథలిక్ పోప్ గా జాన్ V తన పాలన మొదలుపెట్టాడు.
1253: పోప్ ఇన్నోసెంట్ III, వియెన్నె ఫ్రాన్స్ నుంచి యూదులను బహిష్కరించాడు.
1298: ఉర్జుబర్గ్, జర్మనీ లోని ఉర్జుబర్గ్ లో యూదులను ఊచకోత (హత్యాకాండ) కోసారు.
1798: నెపోలియన్, ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియాను పట్టుకున్నాడు.
1829: విలియం ఆస్టిన్ బర్ట్ ‘టైపోగ్రాఫర్’ (టైప్‌రైటర్) కి పేటెంట్ పొందాడు.
1871: సి.హెచ్.ఎఫ్. పీటర్స్, గ్రహశకలం (ఆస్టరాయిడ్) #114 కస్సండ్రను కనుగొన్నాడు.
1877: మొదటి టెలిఫోన్, మొదటి టెలిగ్రాఫ్ లైన్లను హవాయిలో పూర్తి చేసారు.
1877: మొదటి అమెరికన్ మునిసిపల్ రైల్ రోడ్ (సిన్సిన్నాతి సదరన్) మొదలైంది.
1880: మిచిగాన్ లోని గ్రాండ్ రేపిడ్స్ లో మొదటి వాణిజ్య జలవిద్యుత్ కేంద్రం మొదలైంది.
1895: ఎ. ఛార్లోయిస్ గ్రహశకలం (ఆస్టరాయిడ్) #405 థియని కనుగొన్నాడు.
1904: ‘లా పర్చేజ్ ఎక్ష్పో’ ప్రదర్శన జరుగుతున్నప్పుడు, ‘ఛార్లెస్ ఇ. మెంచెస్’, ‘ఐస్ క్రీం కోన్’ ని మొదటిసారిగా ప్రవేశపెట్టాడు.
1908: ‘ఎ. కోఫ్’ #666 డెస్‌డెమొన, #667 డెనైస్ అనే పేర్లు గల రెండు గ్రహశకలాల (ఆస్టరాయిడ్స్) ను కనుగొన్నాడు.
1909: ‘ఎమ్. ఉల్ఫ్’, ‘#683 లాంజియ’ పేరుగల గ్రహశకలాన్ని (ఆస్టరాయిడ్) కనుగొన్నాడు.
1920: కీన్యా బ్రిటిష్ సామ్రాజ్యం లో వలసగా మారింది.
1921: అమెరికాకు చెందిన ‘ఎడ్వర్డ్ గౌర్డిన్’ లాంగ్ జంప్ లో రికార్డు 25′ 2 3/4″ సాధించాడు.
1927: బొంబాయి రేడియో స్టేషను నుండి రోజువారీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.
1932: ‘#1246 ఛక’ అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, ‘సి. జాక్సన్’ కనుగొన్నాడు.
1937: ‘పిట్యూటరీ హార్మోన్’ ని వేరు చేసినట్లుగా ‘యేల్ యూనివెర్సిటీ’ ప్రకటించింది.
1938: ‘#1468 జోంబ’ అనే పేరుగ్ల గ్రహశకలం (ఆస్టరాయిడ్) ని, ‘సి. జాక్సన్’ కనుగొన్నాడు.
1947: మొదటి (అమెరికన్ నేవీ) జెట్స్ ఎయిర్ స్క్వాడ్రన్ ఏర్పడింది (క్వోన్సెట్, ఆర్.ఐ)
1952: ఈజిప్ట్ లోని రాజరికాన్ని కూలదోసి, జనరల్ నెగిబ్, అధ్యక్షుడు అయ్యాడు. (నేషనల్ దినం)
1955: భారతీయ మజ్దూర్ సంఘ్ ని స్థాపించారు. ఈరోజును ప్రతీ సంవత్సరం వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటారు.
1956: గంటకి 3,050 కిలోమీటర్ల వేగంతో, ‘బెల్ ఎక్ష్-2 రాకెట్ ప్లేన్’ ప్రపంచంలోనే, అతి వేగంగా ప్రయాణించిన విమానంగా రికార్డు స్థాపించింది.
1931: హిందూ మహాసమురంలో ఉన్న ‘అష్మోర్’, ‘కార్టియెర్’ దీవులను ఆస్ట్రేలియా ఆధిపత్యంలోకి బదిలీ చేసారు.
1964: ఈజిప్షియన్ ఆయుధాల ఓడ ‘స్టార్ ఆఫ్ అలెంగ్జాండ్రియా’, బోనె (అల్జీరియా) లోని రేవులో పేలి, 100 మంది మరణించారు. 160 మంది గాయపడ్డారు. 20 మిలియన్ డాలర్లు నష్టం జరిగింది.
1965: బీటిల్స్ (గాయకుల గుంపు), ‘హెల్ప్’ అనే ఆల్బంని యునైటెడ్ కింగ్‌డంలో విడుదల చేసారు.
1967: జాతుల వివక్షత కారణంగా జరిగిన అల్లర్లలో, డెట్రాయిట్ లో 43 మంది మరణించారు. 2000 మంది గాయపడ్డారు.
1968: ‘పాలస్తీన లిబరేషన్ ఆర్గనైజేషన్’, ‘ఇ1 ఎ1’ అనే విమానాన్ని, మొదటిసారిగా ‘హైజాకింగ్’ (బలవంతంగా దారి మళ్ళించటం) చేసింది.
1968: జాతుల వివక్షత కారణంగా, కీవ్‌ లాండ్ లో జరిగిన అల్లరలో, ముగ్గురు పోలీసులతో సహా 11 మంది మరణించారు.
1972: మొట్టమొదటి ‘ఎర్త్ రిసోర్సెస్ టెక్నాలజీ సాటిలైట్ (ఇ.ఆర్.టి.ఎస్) ను ప్రయోగించారు.
1973: సెయింట్ లూయిస్ దగ్గర, పిడుగు పడి, ఓజార్క్ ఎ.ఎల్. విమానంలోని 36 మంది మరణించారు
1974: గ్రీకు మిలిటరీ నియంతృత్వం పడిపోయింది.
1979: ‘#2736 ఆప్స్’ అనే గ్రహశకలాన్ని ‘ఇ. బొవెల్’ కనుగొన్నాడు.
1980: ‘సోయుజ్ 37’ అనే రోదసీ నౌక, ఇద్దరు రోదసీ యాత్రికులను (ఒకడు వియత్నాంకి చెందిన వాడు), రోదసీలో అప్పటికే ఉన్న ‘సాల్యూత్ 6’ రోదసీనౌకకు చేరవేసింది.
1984: ‘కుంబ్రియా’ లో ఉన్న ‘సెల్లాఫీల్డ్’ దగ్గర ఉన్న వివాదాస్పదమైన అణు కర్మాగారం దగ్గర నివసిస్తున ప్రజలలో ఎక్కువగా కనిపిస్తున్న కేన్సర్ (ల్యూకేమియా) కి, అక్కడి అణుకర్మాగారానికి సంబంధం లేదని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. మరింత పరిశోధన కూడా జరగాలని చెప్పింది.
1987: తూర్పు జర్మనీకి చెందిన ‘పెత్రా ఫెల్కె’ 78.89 మీటర్ల దూరం ‘జావెలిన్’ విసిరింది (మహిళల రికార్డు).
1987: మొరాకోకి చెందిన ‘సయిద్ ఆఔత’ 5000 మీటర్ల దూరం 12 నిమిషాల 58.39 (12:58.39) సెకన్లలో పరుగు పెట్టి రికార్డు స్థాపించాడు.

జననాలు

శివ్ కుమార్ బటాల్వి, పంజాబీ భాషా కవి. (మ.1973)
1856: బాలగంగాధర తిలక్, భారత జాతీయనేత. (మ.1920)
1870: రాయసం వెంకట శివుడు, రచయిత, పత్రికా సంపాదకులు, సంఘసంస్కర్త. (మ.1954)
1892: హేలి సెలాస్సీ, ఇతియోపియా (1930-1974) చక్రవర్తి (మ. 1975).
1893: కార్ల్ మెన్నింజెర్, మానసిక శాస్త్రవేత్త (మెన్నింజెర్ క్లినిక్) (మ.1990).
1906: చంద్రశేఖర్ ఆజాద్, భారత స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (మ.1931)
1946: పులి వీరన్న, రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందినాడు.
1953: గ్రాహం గూచ్, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1986: గొట్టిముక్కుల రమాకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ వరంగల్ పార్లమెంట్ అధ్యక్షులు, వరంగల్ అర్బన్ జిల్లా, తెలంగాణ.

మరణాలు

1885: యులీసెస్ ఎస్. గ్రాంట్, 18వ అమెరికన్ ప్రెసిడెంట్, తన 63వ ఏట మౌంట్ మెక్‌గ్రెగర్, (న్యూయార్క్) లో చనిపోయాడు.
1916: విలియం రామ్సే, స్కాట్లాండుకు చెందిన రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (జ.1852)
2004: మెహమూద్, భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు. (జ.1932)
2020: ఎం.డి.నఫీజుద్దీన్, తెలుగు రచయిత, సంపాదకుడు, ఆంగ్ల అధ్యాపకుడు. ఎం.డి.సౌజన్య అనే కలం పేరుతో సుపరిచితుడు. (జ.1940)
2022: కార్టూనిస్ట్ పాప ఈనాడు పత్రికలో కార్టూన్లు గీసిన మొదటి తరం కార్టూనిస్టు. (జ.1944)

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు