చరిత్రలో ఈరోజు జూలై 12

BIKKI NEWS : TODAY IN HISTORY JULY 12th

TODAY IN HISTORY JULY 12th

దినోత్సవం :

  • కిరిబతి స్వాతంత్ర్య దినం.
  • నాబార్డ్ స్థాపక దినోత్సవం.

సంఘటనలు

1961: పూణె వరదలు, ఖడక్ వాస్లా, పాన్సెట్ ఆనకట్టలు (డామ్ లు) కారణంగా సగం పూణె నగరం మునిగి పోయింది. లక్ష కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. 2000 మందికి పైగా మరణించారు.
1979: కిరిబతి దీవి బ్రిటన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.

జననాలు

క్రీ.పూ. 101/102 – జూలియస్ సీజర్.
1904: పాబ్లో నెరుడా, చిలీ దేశపు కవి, నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1973)
1906: పువ్వాడ శేషగిరి రావు, తెలుగు కవి, పండితులు, వీరు కవి పాదుషా బిరుదాంకితులు. (మ.1981)
1930: ఇరివెంటి కృష్ణ మూర్తి, తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి తరం కథకులలో ఒకడు. (మ.1991)
1933: గడ్డం గంగారెడ్డి, రాజకీయ నాయకుడు, మాజీ లోకసభ సభ్యుడు. (మ.2017)
1955: నందిని సిధారెడ్డి, సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించాడు.
1957: శ్రీలక్ష్మి రేబాల, నటి, భరత నాట్య కళాకారిణి.
1958: శిలాలోలిత, కవయిత్రి, విమర్శకురాలు.
1977: బ్రాక్ లెస్నర్, అమెరికన్ మిశ్రమ రణతంత్ర యోధుడు, మాజీ వృత్తిగత, ఔత్సాహిక మల్ల యోధుడు.
1982: ఆచంట శరత్ కమల్, టేబుల్ టెన్నిస్ ఆటగాడు.1997

మరణాలు

1803: కంది మల్లయపల్లె ఈశ్వరమ్మ, ఆత్మ విద్య బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది. (జ.1703)
1923: కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, మొట్ట మొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత. (జ.1877)
1985: జిల్లెళ్ళమూడి అమ్మ, ఆధ్యాత్మిక వేత్త. (జ.1923)
1994: ఎం.ఎస్.ఆచార్య, పాత్రికేయుడు. జనధర్మ, వరంగల్ వాణి పత్రికల స్థాపకుడు. (జ.1924)
1999: రాజేంద్ర కుమార్, హిందీ నటుడు. (జ.1929)
2012: దారా సింగ్, భారతీయ మల్ల యోధుడు, సినిమా నటుడు. (జ.1928)

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు