చరిత్రలో ఈరోజు ఆగస్టు 23

◆ దినోత్సవం

  • అంతర్జాతీయ బానిసత్వ అక్రమ రవాణా నిరోధక దినం

◆ జననాలు

1872: టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి. (మ.1957)
1900: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (మ.1974)
1918: అన్నా మణి, భారత భౌతిక శాస్త్రవేత్త, వాతావరణ శాస్త్రవేత్త. (మ.2001)
1921: కెన్నెత్ ఆరో, ఆర్థికవేత్త (మ. 2017).
1923: బలరామ్ జక్కర్, రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు, మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్ (మ.2016).
1923: కులదీప్‌ నయ్యర్‌, రచయిత, పత్రికారచయిత (మ. 2018),
1932: ఉండేల మాలకొండ రెడ్డి, ఇంజనీరు, తెలుగు రచయిత, కవి.
1949: బి.ఎస్.రాములు, నవలాకారుడు, కథకుడు.
1953: అట్టాడ అప్పల్నాయుడు, ఉత్తరాంధ్రకు చెందిన కథా, నవలా రచయిత.
1963: పార్క్ చాన్-వుక్, దక్షిణ కొరియాకు చెందిన సినీ దర్శకుడు, రచయిత, నిర్మాత.

◆ మరణాలు

634: అబూబక్ర్, మహమ్మద్‌ ప్రవక్త ఇస్లాం మతం గురించి ప్రకటించిన తరువాత, ఇస్లాంను స్వీకరించినవారిలో ప్రథముడు.
1890: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (జ.1803)
1971: షామూ, అనేక సీ వరల్డ్ ప్రదర్శనలలో అద్భుతమైన ప్రదర్శనలిచ్చిన నీటి జంతువు.
1979: జి.వి.కృష్ణారావు, హేతువాది, రచయిత. (జ.1914)
1987: కందిబండ రంగారావు, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసిన స్వాతంత్ర్య సమరయోధుడు (జ.1907)
1994: ఆరతి సాహా, ఇంగ్లీషు ఛానెల్ ను ఈదిన తొలి భారతీయ మహిళ. (జ.1940)
2018: కులదీప్‌ నయ్యర్‌, రచయిత, పత్రికారచయిత (జ. 1923)..