Home > CURRENT AFFAIRS > TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th FEBRUARY 2024

TODAY CURRENT AFFAIRS IN TELUGU 4th FEBRUARY 2024

1) G77 సదస్సు 2024 ఉగాండా దేశంలోని కంపాలా లో జరిగింది. ఈ కూటమిలో సభ్యదేశాలు ఎన్ని.?
జ : 134

2) ఏ పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రికి పదేళ్ల జైలు శిక్ష విధించారు.?
జ : ఇమ్రాన్ ఖాన్

3) ఆదాయం లేకపోయినా భార్యకు భరణం చెల్లించాల్సిందేనని ఏ హైకోర్టు తీర్పు ఇచ్చింది.?
జ : అలహాబాద్

4) 2026 నాటికి భారతదేశంలో బిచ్చగాళ్లను లేకుండా చేయడానికి కేంద్రం ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి .?
జ : భిక్షా ముక్త్ భారత్

5) రాష్ట్రపతి ద్రౌపది ఎవరిని రాజ్యసభకు నామినేట్ చేశారు.?
జ : సత్నామ్ సింగ్ ( చండీగఢ్ యూనివర్సిటీ ఫౌండర్)

6) దేశంలో తొలిసారి చేపట్టిన మంచు చిరుతల గణన ప్రకారం ఎన్ని మంచు చిరుతలు ఉన్నాయి.?
జ : 718

7) రూసోమా ఆర్గానిక్ ఆరెంజ్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో నిర్వహించారు.?
జ : నాగాలాండ్

8) ఏ వయసు బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వేయడానికి కేంద్రం నిర్ణయించింది.?
జ : 9 – 14 సంవత్సరాల బాలికలు

9) భారత్ కు ఏ డ్రోన్ల అమ్మకానికి అమెరికా ఒప్పందం చేసుకుంది.?
జ : MQ 9B

10) ప్రభుత్వ పాఠశాలలో ఐబీ బోధన విధానాన్ని అమలు చేయడానికి ఏ రాష్ట్రం ఒప్పందం చేసుకుంది.?
జ : ఆంధ్రప్రదేశ్

11) 2022 – 23 నాటికి దేశంలో ఎంత శాతం పేదరికం నమోదైనట్లు నీతీ అయోగ్ ప్రకటించింది.?
జ : 11.28%

12) 2022 – 23 నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఎంత శాతం పేదరికం నమోదైనట్లు నీతీ అయోగ్ ప్రకటించింది.?
జ : 4.19%

13) కిసాన్ అగ్రి షో 2024 ఏ నగరంలో నిర్వహించారు.?
జ : హైదరాబాద్

14) కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది .?
జ : 13

15) దేశంలో తొలి ఆర్టిపిషియల్ ఇంటిలిజెన్స్ స్టార్టప్ యూనికార్న్ గా ఏది నిలిచింది.?
జ : కృత్రిమ్