1) IMF తాజా నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధిరేటు ఎంత.?
జ : 6.8%
2) భారతదేశంలో అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏది?
జ: తేహ్రీ పవర్ ప్రాజెక్టు (2400MW)
3) దక్షిణాఫ్రికా తో జరిగిన 3 వన్డేల ఇంటర్నేషనల్ క్రికెట్ సిరీస్ ను భారత్ జట్టు ఎంత తేడాతో గెలుచుకుంది.?
జ : 2 – 1
4) ఇటీవల మరణించిన ములాయం సింగ్ యాదవ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశాడు.?
జ : ఉత్తరప్రదేశ్
5) తదుపరి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియామకం కానున్నారు.?
జ : జస్టిస్ చంద్రచూడ్
6) బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియామకం కానున్నారు.?
జ : రోజర్ బిన్నీ
7) 20 కోట్ల సంవత్సరాల తర్వాత భూమి మీద ఉన్న ఖండాలన్నీ కలిసి ఏక ఖండంగా మారనునట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ ఖండానికి వారు పెట్టిన పేరు ఏమిటి.?
జ : అమీషియా
8) ఆక్స్‌ఫామ్ సంస్థ విడుదల చేసిన ‘ప్రజారోగ్యంపై ప్రభుత్వాల ఖర్చు’ నివేదికలో 161 దేశాలకు గాను భారత దేశ స్థానం ఎంత.?
జ : 157
9) ఆక్స్‌ఫామ్ సంస్థ విడుదల చేసిన ‘ప్రజారోగ్యంపై ప్రభుత్వాల ఖర్చు’ నివేదిక పేరు ఏమిటి.
జ : కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇనిక్వాలిటీ ఇండెక్స్ (CRII)
10) దక్షిణాఫ్రికా తో జరిగిన 3 వన్డేల శిరీషను భారత్ ఎంత తేడాతో గెలుచుకుంది.?
జ : 2-1
11) ఏ సోషల్ మీడియా సంస్థను రష్యా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.?
జ : మెటా గ్రూప్
12) సెప్టెంబర్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా నిలిచిన భారత క్రీడాకారిణి ఎవరు.?
జ : హర్మన్ ప్రీత్ కౌర్
13) WHO కార్యనిర్వాహక మండలి లో అమెరికా ప్రతినిధిగా నియమించబడ్డ భారత సంతతి వ్యక్తి ఎవరు.?
జ : డా. వివేక్ మూర్తి
14) తెలంగాణ యొక్క టీ హబ్ సాంకేతిక విషయంలో ఇటీవల ఏ దేశం సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.?
జ : ప్రాన్స్