THE GLOBAL FOOD POLICY REPORT – 2023 – UN

BIKKI NEWS : ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (IFPRI) సంస్థ THE GLOBAL FOOD POLICY REPORT తాజా నివేదికను విడుదల చేసింది.

ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పోషకాహారం లేమితో బాధపడుతున్న వారి సంఖ్య 76.80 కోట్లకు చేరింది. . ఈ సంఖ్య 2014 నాటికి 57.20 కోట్లగానే ఉండడం విశేషం.

2014 – 2021 నాటికి పోషకాహార లేనిదో బాధపడుతున్న వారి శాతం 34.2% పెరగడం విశేషం.

దీంతో పోషకాహార లేమితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది… ఆహరం అందినప్పటికీ పోషకాలతో కూడిన ఆహారం అందకపోవడమే దీనికి ప్రధాన కారణం.

ఈ నివేదిక ప్రకారం భారతదేశం మరియు దక్షిణాసియా దేశాలలో పోషకాహార లేమితో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది.

అత్యధికంగా ఆఫ్ఘనిస్తాన్ లో 30% మంది పోషకాహార లేమితో బాధపడుతున్నారు.

భారతదేశంలో కూడా 16% మంది పోషకాహార లేమితో బాధపడుతున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది.

పాకిస్థాన్ 17%, బంగ్లాదేశ్ 12%, నేపాల్ 6%, శ్రీలంక 4% గా పోషకాహార లేమితో బాధపడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘పోషణ్ ట్రాకర్’ నివేదిక ప్రకారం 14 లక్షల మంది పిల్లలు పోషకాహర లేమితో బాధపడుతున్నారు.