లండన్ (అక్టోబర్ 19) : ప్రపంచ సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ 2022కు (BOOKER PRIZE 2022) గాను శ్రీలంక రచయిత షెహన్ కరుణతిలక (47) గెలుచుకున్నారు.
శ్రీలంకలోని అంతర్యుద్ధాన్ని నేపథ్యంగా చేసుకొని ఆయన రచించిన ఆఫ్టర్ లైఫ్ థ్రిల్లర్ నవల ”ది సెవెన్ మూన్స్ ఆఫ్ మాలీ అల్మెయిడా”కు ఈ పురస్కారం దక్కింది.
సోమవారం లండన్ లో జరిగిన కార్యక్రమంలో కరుణతిలకకు 50వేల పౌండ్ల నగదు బహుమతిని అందజేశారు. శ్రీలంకలో పుట్టిన నవలా రచయితలను బుకర్ప్రై ప‌్రైజ్ వరించడం ఇది రెండోసారి. కరుణతిలక కంటే ముందు 1992లో మైఖేల్ ఆండాట్టే ఈ పురస్కారాన్ని అందుకొన్నారు.