ప్రభుత్వ ఇంటర్ విద్యను పరిరక్షిద్దాం : టీజీఎల్ఏ రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న

సిద్దిపేట (ఆగస్టు – 25) : తెలంగాణ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రాథమిక సభ్యుల సమావేశం సందర్భంగా ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె వెంకన్న హాజరయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన ఇంటర్ విద్యను అందించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని అడ్మిషన్ల యొక్క సంఖ్య ప్రతియేట పెంచే విధంగా అధ్యాపకులుగా కృషి చేద్దామని తద్వారా ముఖ్యమంత్రి కెసిఆర్ చేసినటువంటి క్రమబద్ధీకరణకు తగిన ఫలితం లభిస్తుందని అన్నారు.

గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ చేయడం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని, గెజిటెడ్ స్థాయి ఉద్యోగులను క్రమబద్దికరించిన చరిత్ర కేవలం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి మాత్రమే దక్కుతుందని ఇది ఒక చారిత్రక నిర్ణయంగా దేశంలో నిలుస్తుందని వారు అన్నారు.త్వరలోనే క్రమబద్దీకరణ కానీ అధ్యాపకులకు ఉత్తర్వుల వచ్చే అవకాశం ఉందని వారన్నారు.

ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ క్రమబద్దీకరణ కొరకు కృషిచేసిన గాదె వెంకన్న గారిని ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర నాయకులు బచ్చలకూర గోవర్ధన్, కోటేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు లవ కుమార్, మరియు సాహెబ్ నాజర్, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.