సమస్యల పరిష్కారానికై బుర్రా వెంకటేశంకు వినతి – TGJLA

BIKKI NEWS (MAY 20) : తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యారంగంలో పలు సమస్యలు పరిష్కారం కొరకు ఈరోజు తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి గౌరవ బుర్రా వెంకటేశం గారిని తెలంగాణ సచివాలయంలో కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు (TGJLA UNION MEETS BURRA VENKATESHAM) తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్ల అసోసియేషన్ 475 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో పలు విధులు నిర్వహించిన వారికి వెంటనే రెమ్యూనరేషన్ అందజేయాలని తెలిపారు.

గతంలో కొత్తగా శాంక్షన్ చేసిన 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రిన్సిపాల్ పోస్టు & ఇతర టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు.

క్రమబద్దీకరణ కాకుండా మిగిలిపోయిన కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్దీకరణ జరిగేటట్లు చూడవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఇంటర్ విద్యా విభాగంలో బదిలీలు లేక సిబ్బంది పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం ముందే బదిలీలు నిర్వహించాలని కోరారు. నూతన అధ్యాపకులకు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్స్ కోరే సౌకర్యం కల్పించాలని వారి సొంత జోనులకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరారు.

ఈ సమస్యల పరిష్కారం కొరకు గౌరవ విద్యాశాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం గారు సానుకూలంగా స్పందించడం జరిగిందని కొప్పిశెట్టి తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కొప్పిశెట్టి సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లేపల్లి పూర్ణచందర్, రాష్ట్ర నాయకులు గుమ్మడి మల్లయ్య, పి సత్యనారాయణ, ఎన్ రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.