తెలుగు భాషా దినోత్సవం – గిడుగు రామ్మూర్తి జయంతి

BIKKI NEWS (ఆగస్టు – 29) : వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు రామ్మూర్తి (Gidugu Rammurthy) జయంతి రోజును తెలుగు భాషాదినోత్సవం లేదా తెనుగు నుడినాడు గా (Telugu Language Day) జరుపుకుంటారు.

ఈ రోజు సభలు జరిపి తెలుగు భాష గొప్పతనాన్ని, ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వినియోగం పెంచడానికి కృషిని, ప్రాథమిక తరగతులలో మాతృభాష భోదన వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు.

ప్రపంచీకరణ వలన పిల్లలను ఆంగ్ల మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని సమాచారం. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మాతృభాష కాస్త మృతభాషగా మారే ప్రమాదమున్నది.

ఐక్యరాజ్యసమితి విద్య సాంస్కృతిక సంస్థ 1999/2002-12 తీర్మానంలో ప్రపంచంలోని 6000 భాషలలో 3000 కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి భారతదేశంలో కేవలం 5 భాషలు (హిందీ, బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం) మిగులుతాయని పేర్కొన్నారు.

అలాగే తెలంగాణ భాషా దినోత్సవాన్ని – సెప్టెంబర్ – 9 (కాళోజీ జయంతి) సందర్భంగా నిర్వహిస్తారు.

అంతర్జాతీయ భాషా దినోత్సవం – ఫిబ్రవరి – 21న నిర్వహిస్తారు.