ఎన్నికల తర్వాతే DSC (TRT).!

హైదరాబాద్ (జూలై – 08) : పలు విద్యా సమస్యలపై చర్చించేందుకు భేటీ అయినా మంత్రి వర్గ ఉప సంఘం తెలంగాణ రాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ (TS TET 2023) నిర్వహించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే టెట్ నిర్వహించి ఫలితాలు ఇచ్చే సరికి సెప్టెంబరు వస్తుంది. ఆ తర్వాత అక్టోబరులో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్నందున ఇక DCS (TRT) జరిపే అవకాశం దాదాపు లేనట్లేనని స్పష్టమవుతోంది.

దానికి తోడు పాఠశాలలో విద్యార్థులు 21 లక్షల మంది ఉంటే, టీచర్లు ఏకంగా 1.03 లక్షల మంది ఉన్నారు. ఏటా అధిక సంఖ్యలో విద్యార్థులు గురుకులాల్లో చేరుతున్నందున సాధారణ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గుతున్నాయని కొందరు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణ చేసిన తర్వాతే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టేలా నిర్ణయం తీసుకుందామని కీలక మంత్రి ఒకరు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అంటే ప్రస్తుతం టెట్ జరిపినా, ఎన్నికల తర్వాతే టీఆర్టీ చేపట్టే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.