Home > JOBS > TELANGANA JOBS > JOBS – ARMY PUBLIC SCHOOL GOLCONDA లో 48 టీచింగ్ ఉద్యోగాలు

JOBS – ARMY PUBLIC SCHOOL GOLCONDA లో 48 టీచింగ్ ఉద్యోగాలు

BIKKI NEWS (జనవరి – 01) : గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో 2024 – 25 విద్యా సంవత్సరానికి సంబంధించి 48 టీచింగ్ పోస్టుల భర్తీకి (TEACHING JOBS IN ARMY PUBLIC SCHOOL GOLCONDA) దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేశారు.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి – 20 – 2024 వరకు ప్రత్యక్ష పద్దతిలో దరఖాస్తు చేసుకోగలరు.

ఖాళీల వివరాలు:

పీజీటీ: 07 పోస్టులు

సబ్జెక్టులు: ఇంగ్లిష్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ .

టీజీటీ: 13 పోస్టులు

సబ్జెక్టులు: ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సైన్స్, కంప్యూటర్స్.

పీఆర్డీ: 17 పోస్టులు

సబ్జెక్టులు : అన్ని సబ్జెక్టులు.

హెడ్మాస్టర్: 01 పోస్టు

ప్రీ ప్రైమరీ టీచర్లు: 10 పోస్టులు

అర్హతలు : సంబంధిత విభాగంలో ఇంటర్, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, పీజీ, సీటీఈటీ టెట్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి : 55 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం : ఆఫ్లైన్ (ప్రత్యక్ష పద్దతిలో)

చిరునామా : ప్రిన్సిపాల్, ఆర్మీ పబ్లిక్ స్కూల్, గోల్కొండ, హైదరాబాద్ చిరునామాకు పంపాలి.

దరఖాస్తు గడువు : జనవరి 20 – 2024.

వెబ్సైట్ :
https://www.apsgolconda.edu.in/