BIKKI NEWS : తెలంగాణలోని యువతీయువకులకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) (TASK) ద్వారా శిక్షణ ఇస్తోంది.
2020-21 విద్యా సంవత్సరానికి స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. TASK రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది.
● ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ::
BE, B.Tech, B.Pharmacy, MCA, MBA, PGDM, BA, BSc, B.Com, BCA, BBM, BBA, MA, M.Sc, M.Com, Polytechnic – విద్యార్థుల నుంచి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది
పైన వెల్లడించిన కోర్సుల్లో మొదటి, రెండో, మూడో, నాలుగో సంవత్సరాల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు.
◆ రిజిస్ట్రేషన్ ఫీజు వివరాలు ::
● బీఈ, బీటెక్ చదువుతున్న జనరల్, ఓబీసీ విద్యార్థులు రూ.1416, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.708,
● డిగ్రీ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ, ఫార్మసీ చదువుతున్న జనరల్, ఓబీసీ విద్యార్థులు రూ.590, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.295,
● పాలిటెక్నిక్ విద్యార్థులు రూ.295 ఫీజు చెల్లించాలి.
◆ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు చివరి తేదీ :: డిసెంబర్ 27 – 2020
TASK రిజిస్టర్ చేసుకోవడానికి, మీ అకాడమిక్ పరీక్షల్లో వచ్చిన మార్కులతో సంబంధం లేదు. విద్యార్థులు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఒక్కసారి టాస్క్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితాంతం వేలిడిటీ ఉంటుంది.
● TASK కల్పించే అవకాశాలు ::
* పరిశ్రమ సంబంధిత కోర్సులు అందుబాటులో ఉంటాయి.
* విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోవచ్చు.
* సంబంధిత పరిశ్రమల్ని సందర్శించే అవకాశం లభిస్తుంది.
* ఇంటర్న్‌షిప్ అవకాశాలు లభిస్తాయి.
* నిపుణులతో మాట్లాడొచ్చు.
* పలు సంస్థలు నిర్వహించే ప్లేస్‌మెంట్ డ్రైవ్స్‌లో పాల్గొనొచ్చు.
* ఇ-లెర్నింగ్ కంటెంట్‌ని ఆన్‌లైన్, మ్యాసీవ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సులు చేయొచ్చు.
* కెరీర్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్స్‌లో పాల్గొనొచ్చు.
● పూర్తి వివరాలకు & రిజిస్ట్రేషన్ కొరకు వెబ్సైట్ ::