MEDICINE NOBEL 2022 : స్వాంటె పాబోకు వైద్య నోబెల్

  • స్వీడన్ శాస్త్రవేత్తకు పురస్కారం
  • మానవ పరిణామ క్రమంపై పరిశోధనలకు గుర్తింపు

స్టాక్ హోమ్ (అక్టోబర్ 3) : మానవ శరీరంలో వేల ఏండ్లుగా కొనసాగుతున్న జన్యువుల ప్రవాహాన్ని తెలియజెప్పిన స్వీడిష్ శాస్త్రకొత్త స్వాంటె పాబోకు అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం(MEDICAL NOBEL – 2022) దక్కింది.

వైద్యశాస్త్ర విభాగంలో భాగంగా పాబోకు అవార్డు అందిస్తున్నట్టు స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో నోబెల్ బృందం సోమవారం ప్రకటించింది. పాబో మానవ పరిణామ క్రమాన్ని విశదీకరించ 1౦తో నూతన విషయాలను తెలుసుకోగలిగామని వెల్లడించింది.

అంతరించిపోయిన నియాండెర్తల్ జన్యువును సీక్వెన్స్ చేసి, హొమినిన్ డెనిసోవాపై పాబో కీలక ఆవిష్కరణ చేశారు. 70 వేల ఏండ్లకు పూర్వం ఆఫ్రికా నుంచి వలస వచ్చి, ఆ తర్వాత అంతరించిపోయిన హొమినిన్ల నుంచి హోమోసెపియన్లకు జన్యు బదిలీ జరిగిందని ఈయన గుర్తించారు. ప్రస్తుత మానవుల్లోనూ నాటి జన్యువుల ప్రవాహం కొనసాగుతున్నదని స్పష్టం చేశారు. ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నదని వివరించారు. పాబో పరిశోధనలు ఎన్నో ఆవిష్కరణలకు దారి తీసిందని నోబెల్ బృందం కొనియాడింది.

◆ పాబో తండ్రికి కూడా వైద్యంలోనే నోబెల్

స్వాంటె పాబో స్టాక్ హొమ్ జన్మించారు. ఆయన తల్లి ఎస్టోనియాకు చెందిన కెమిస్ట్ కరిన్ పాబో. తండ్రి స్వీడన్ కు చెందిన బయోకెమిస్ట్ కార్ల్ సనే బెర్గ్ స్ట్రోమ్. ఈయన కూడా 1982లో వైద్య ‘రంగంలోనే నోబెల్ అందుకోవడం విశేషం. మరో ఇద్దరితో కలిసి ఆయనీ పురస్కారం అందుకున్నారు.

Comments are closed.