SUPREME COURT – కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై కేసు కొట్టివేత

న్యూడిల్లీ (సెప్టెంబర్ 19 ) : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం కోసం కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 16 పై నిరుద్యోగులు వేసిన కేసును ఈరోజు సుప్రీంకోర్టు (supreme court rejects case on go no 16) కొట్టివేసింది.

ఇప్పటికే పలుమార్లు తెలంగాణ హైకోర్టు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలిస్తూ జీవో నెంబర్ 16 పై వేసిన పలు కేసులను కొట్టివేయడమే కాక పిటిషన్ దార్లకు జరిమానాలు కూడా విధించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియ మరింత సులభతరం, వేగవంతం కానుంది. ఇప్పటికే పలు శాఖల కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కు చేరి క్రమబద్ధీకరణకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.