హైదరాబాద్ (మే – 11) : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఆధ్వర్యంలో ‘కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్-2023 (CHSL 2023 notification) నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1,600 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
◆ మొత్తం ఖాళీలు: 1,600
- లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్డీసీ),
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈవో)
- డేటా ఎంట్రీ ఆపరేటర్(గ్రేడ్-ఎ)
◆ అర్హతలు : ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఓపెన్ స్కూల్ ద్వారా చదివినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
కంప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాలో డేటా ఎంట్రీ పోస్టులకు ఇంటర్ లో సైన్స్ గ్రూప్ తో మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి వుండాలి.
◆ వయోపరిమితి : 01-08-2023 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
◆ ఎంపిక విధానం : టైర్-1, టైర్-2 పరీక్షల మార్కుల ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు వారు దరఖాస్తు చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
◆ దరఖాస్తు ఫీజు : 100/- (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఫీజు చెల్లించనక్కర్లేదు.)
◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్
◆ దరఖాస్తుకు చివరి తేదీ : జూన్ –
08 – 2023.
◆ దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరి
తేదీ : జూన్ – 10 -2023.
◆ పరీక్ష తేదీలు :
టైర్-1(కంప్యూటర్ ఆధారిత పరీక్ష):
ఆగస్టులో
టైర్-2 (కంప్యూటర్ ఆధారిత పరీక్ష)
నిర్వహణ తేదీలు: తర్వాత ప్రకటిస్తారు.
◆ పూర్తి నోటిఫికేషన్ : DOWNLOAD PDF
◆ వెబ్సైట్ : https://ssc.nic.in/