సెమీస్ కి చేరిన సౌతాప్రికా – ఏ జట్టుకు ఎంత అవకాశం.?

హైదరాబాద్ (నవంబర్ – 04) : ICC CRICKET WORLD CUP 2023 లో సెమీస్ కి చేరిన రెండో జట్టు గా దక్షిణాఫ్రికా నిలిచింది. ఇప్పటికే భారత్ సెమీఫైనల్ కు చేరిన విషయం తెలిసిందే.

ఈరోజు న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పాకిస్తాన్ సంచలన విజయం నమోదు చేసింది. దీంతో న్యూజిలాండ్ కు 8 పాయింట్లతోనే ఉండడంతో సౌత్ఆఫ్రికా సెమీఫైనల్ చేరినట్లు అయింది.

సెమీఫైనల్ కోసం ఇంకా రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే 4 జట్లు పోటీలో ఉన్నాయి. ఆస్ట్రేలియ, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇంకా రేసులో ఉన్నాయి.

ఆస్ట్రేలియా ఈరోజు మ్యాచ్ లో గెలిస్తే దాదాపు సెమీఫైనల్ బెర్త్ ఖాయమైనట్లే. ఈరోజు ఆస్ట్రేలియా ఆడే గేమ్ తో కలిపి మూడు మ్యాచ్ లు ఉన్నాయి.

న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరాలంటే తర్వాతి మ్యాచ్ లలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాల్సి ఉంటుంది. మరియు న్యూజిలాండ్ తన చివరి మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.

పాకిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే న్యూజిలాండ్ తన చివరి మ్యాచ్ లో భారీ తేడాతో ఓడిపోవాలి, ఆఫ్గానిస్తాన్ తన రెండు మ్యాచ్ లలో ఓడిపోవలసి ఉంటుంది.

ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ చేరాలంటే పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తమ చివరి మ్యాచ్ లలో భారీ తేడాతో ఓడిపోవలసి ఉంటుంది.