PAKvsNZ : పాకిస్థాన్ గెలుపు

బెంగళూరు (నవంబర్ – 04) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా ఈరోజు పాకిస్థాన్, న్యూజిలాండ్ (PAKvsNZ) జట్ల మద్య బెంగళూరులో జరుగుతున్న కీలకమైన మ్యాచ్ లో వర్షం కారణంగా డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పాకిస్థాన్ 21 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించి సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది.

డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 41 ఓవర్లలో 342 పరుగులు సాదించాల్సి ఉండగా పాకిస్థాన్ మరల వర్షం పడే సమయానికి 25.3 ఓవర్లలో 200/1 పరుగులతో నిలిచింది.. క్రీజులో పఖర్ జమాన్ 126*, బాబర్ ఆజమ్ – 66* పరుగులతో ఆడుతున్నారు. పాకిస్థాన్ డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 21 పరుగులు ఆధిక్యంలో ఉండడంతో విజేతగా నిలిచింది.

మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 401/5 పరుగులు సాదించింది. రచిన్ రవీంద్ర – 108, కేన్ విలియమ్స్ సన్ -95, ఫిలిప్స్ – 41 పరుగులతో రాణించారు. వసీం జూనియర్ 3 వికెట్లు తీశాడు