AUSvsENG : ఆసీస్ గెలుపు – ఇంగ్లండ్ ఔట్

ఆహ్మదాబాద్ (నవంబర్ – 04) : ICC CRICKET WORLD CUP 2023 లో భాగంగా ఈరోజు ఆహ్మదాబాద్ లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ (AUSvsENG) జట్ల మద్య కీలకమైన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 33 పరుగుల తేడాతో విజయం సాదించి ఇంగ్లండ్ కు ఇంటి దారి చూపించింది. దీంతో ఇంగ్లండ్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.

287 పరుగులు లక్ష్యం తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 253 పరుగులకు ఆలౌట్ అయింది. బెన్ స్టోక్బ్ – 68, మలాన్ – 50 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా – 3, స్టార్క్, కమ్మిన్స్, హెజిల్‌వుడు తలో 2 వికెట్లు తీశారు.

టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. లబుషఘన్ – 71, గ్రీన్ – 47 పరుగులతో రాణించడంతో 286 పరుగులు సాదించింది.. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ – 4, ఆదిల్ రషీద్ – 2 వికెట్లు తీశారు.

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ జట్టు ఓడిపోతే టోర్నీ సెమీస్ అవకాశాలు అధికారికంగా మూసుకుంటాయి. టోర్నీ నుండి నిష్క్రమించిన రెండో జట్టు కానుంది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు గెలుపుతో సెమీఫైనల్ అవకాశాలు మరింత మెరుగుపడతాయి.