Home > ANDHRA PRADESH > Social Media Jobs – సోషల్ మీడియా ఔటసోర్సింగ్ జాబ్స్

Social Media Jobs – సోషల్ మీడియా ఔటసోర్సింగ్ జాబ్స్

BIKKI NEWS (DEC. 21) : social media executive and assistant job notification in ap. సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ మరియు సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

social media executive and assistant job notification in ap

మంత్రుల ఫేషీలలో పనిచేయడానికి ఆసక్తి కలిగిన, సోషల్ మీడియా పై అవగాహన కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కు అర్హతలుగా బీటెక్/బీఈ, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. మరియు సంబంధిత మంత్రిత్వ శాఖపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి.

ఏపీ డిజిటల్ కార్పోరేషన్ చైర్మన్ మరియు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ల బృందం వీరిని ఇంటర్వ్యూ ఆధారంగా నియామకం చేయనుంది.

నియామకమైన అభ్యర్థులకు రెండు నెలల పాటు శిక్షణ ఇచ్చి తలనంతరం ఒక ఏడాది పాటు ఔట్సోర్సింగ్ పద్ధతిలో కొనసాగించనున్నారు.

సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కు నెలకు 50,000/- రూపాయలు, సోషల్ మీడియా అసిస్టెంట్ పోస్టుకు 30, 000/- రూపాయల చొప్పున వేతనం చెల్లించనున్నారు

FOLLOW US @TELEGRAM & WHATSAPP & YOUTUBE

తాజా వార్తలు