చిన్న ఉపగ్రహాల ప్రయోగానికి చిన్న రాకెట్ : SSLV

BIKKINEWS : ISRO అతి తక్కువ ఖర్చుతో చిన్న ఉపగ్రహాలను ప్రయోగించే లక్ష్యంతో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (SSLV)ను తయారు చేసింది. మార్చి 25న SSLV తో పూర్తి స్థాయి ప్రయోగం చేపట్టనుంది.

ఈ ఏడాది చివరి నాటికి 100 కిలోల నుంచి 500 కిలోల బరువుండే 6,000 చిన్న ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

SSLV 34 మీటర్ల ఎత్తు, రెండు మీటర్ల వ్యాసార్ధం కలిగి ఉంటుంది. ప్రయోగ సమయంలో 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్ ను.. 500 కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి అతి దగ్గరగా వున్న లియో ఆర్బిట్లో ప్రవేశపెట్టే విధంగా డిజైన్ చేశారు. రాకెట్లోని మొదటి, రెండు, మూడు దశలను ఘన ఇంధనంతో ప్రయోగించేలా డిజైన్ చేశారు. ఇందులో ద్రవ ఇంధనం దశ ఉండదు. వెలాసిటీ టైమింగ్ మాడ్యూల్ అనే దశను కొత్తగా అమర్చారు. ఈ దశలోనే ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడతారు.