హైదరాబాద్ (సెప్టెంబర్ – 06) : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా ఉన్న తన బ్యాంకులలో ప్రొబేషనరీ ఆఫీసర్ (SBI 2,000 PROBATIONARY OFFICER JOBS NOTIFICATION) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఏదైనా డిగ్రీ అర్హత కలిగి ఉన్న లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థులకు 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు సడలింపు కలదు.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను సెప్టెంబర్ 7 నుండి 27 తేదీ వరకు స్వీకరించనున్నారు.
ఈ ఉద్యోగాలకు ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు ఫీజు జనరల్, EWS, ఓబీసీ అభ్యర్థులకు 750/- కాగా… ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుడి అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
CIBIL సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీ మంచిగా ఉన్నఅభ్యర్థులకే పోస్టింగ్ ఇవ్వబడును.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు గడువు : సెప్టెంబర్ – 07 నుంచి 27 వరకు
ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష : నవంబర్ – 2023
ఆన్లైన్ మెయిన్స్ పరీక్ష : డిసెంబర్ – 2023 & జనవరి – 2024
సైకోమెట్రిక్ పరీక్ష : జనవరి/ఫిబ్రవరి – 2024
ఇంటర్వ్యూ : జనవరి/ఫిబ్రవరి – 2024
తుది ఫలితాలు : ఫిబ్రవరి/మార్చి – 2024
వెబ్సైట్ : https://sbi.co.in/web/careers#lattest
One Comment on “SBI PO JOBS : 2,000 ప్రొబెషనరీ ఉద్యోగాలు”
Comments are closed.