దక్కన్ విప్లవ జ్వాల-సర్వాయి పాపన్న : విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్

  • సర్దార్ పాపన్న మహారాజ్ 373 వ జయంతి వారోత్సవాలు ప్రత్యేక వ్యాసం
  • విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్ (ప్రొహిబిషన్ ఎక్సైజ్ క్రీడా సాంస్కృతిక పర్యాటకశాఖ మంత్రివర్యులు)

తెలంగాణ ఒక మహిమాన్విత నేల, మట్టి మనుషులు మహా పాలకులుగా ఎదిగిన ఘట్టాలతో శౌర్యం మానవత్వం అనే కిరీటాల తో ఈ నేల చరిత్ర గొప్ప ప్రత్యేకతను సంతరించుకున్నది. అణచివేత, వివక్షత తీవ్రమైనప్పుడు ఆత్మగౌరవం మంట కలిపినప్పుడు ఎంతటి బలశాలునైనా పాలకులనైనా దిక్కరించి మట్టి కరిపించిన మహత్తర సన్నివేశాలకు తెలంగాణ సాక్షిభూతం అయింది.

14 శతాబ్దపు ఐరోపా చరిత్ర కాలంలో పీడకులను ఎదిరించి పీడితులను కాపాడడానికి కారణజన్ముడుగా వ్యవహరించిన జానపద సాహిత్యంలో సుప్రసిద్ధ ప్రధాన పాత్రగా ఉన్న రాబిన్ హుడ్ పోరాట ధీరత్వానికి ఒక నమూనాగా చరిత్ర నిర్మాణంలో తనదైన చెరగని పాత్రను నిర్వర్తించిన ఒక మహా యోధుడు తెలంగాణ గడ్డపై జన్మించాడు అతడే సర్దార్ సర్వాయి పాపన్న. పీడిత ప్రజలకు రక్షకుడుగా నిలిచిన 15 సంవత్సరాల కాలంలో ప్రతిక్షణాన్ని ఉత్కంఠ భరితంగా, ధైర్య సాహసాలతో ఆత్మగౌరవంతో సర్వాయి పాపన్న జీవించాడు.

పీడిత ప్రజలకు రక్షకుడుగా నిలిచిన 15 సంవత్సరాల కాలంలో ప్రతిక్షణాన్ని ఉత్కంఠ భరితంగా, ధైర్య సాహసాలతో ఆత్మగౌరవంతో సర్వాయి పాపన్న జీవించాడు. – విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్

మధ్యయుగం అంధయుగంగా కొనసాగుతున్న సందర్భం. మొగలుల పాలన లో వారి సామంతులు, జమీందారుల దాస్టిక చర్యలతో ప్రజలు బానిసలుగా బ్రతుకుతున్న కాలం అది. ప్రశ్నించడం,తిరగబడడం వారి ఆలోచనలలో ఊహల్లో కూడా రాని దైన్య స్థితిలో ప్రజలు జీవిస్తున్నారు. 1323లో కాకతీయ సామ్రాజ్యం పతనం తర్వాత వారి భౌగోళిక పరిపాలన పునాదుల మీద కుతుబ్ షాహీలు తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. వీరికింద తెలంగాణలోని రెండు ఆధిపత్య కులాలకు చెందిన వారు సామంత రాజులుగా వ్యవహరించి పాలిస్తున్నారు. గ్రామీణ ప్రజలను తీవ్రంగా దోపిడీ చేస్తూ ఆ దోపిడి సొమ్ములో అధికభాగం గోల్కొండ సుల్తాన్ కు పంపించేవారు. దక్కన్ ప్రాంతంలో గోల్కొండ ఓ ధనవంతమైన నగరంగా వెలసింది. వజ్రాల వ్యాపారానికి అంతర్జాతీయంగా పేరు పొందింది. వస్త్రాల ఉత్పత్తి, విలువైన లోహాల ఉత్పత్తి ఎగుమతులతో గోల్కొండ కోశాగారం సమృద్ధిగా నిండిపోయి ఉన్నది.1687 లో గోల్కొండ రాజ్యం పూర్తిగా మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆధీనంలోకి వచ్చింది. అనేక పరిపాలన సంస్కరణలు చేశాడు. కాకతీయులు కుతుబ్షాహీల కాలంలో జమీందారులుగా వ్యవహరించిన ఆధిపత్య నాయకులను గ్రామస్థాయి మనసబ్ దారులుగా మార్చాడు. కీలక పరిపాలన సైనిక పదవులను ఇరాన్ దేశస్థులకు కట్టబెట్టాడు. దక్కన్ లోని అన్ని ప్రాంతాల నుండి వ్యాపారస్తులు సరుకుల రవాణా గోల్కొండ చేరడానికి మంచి రహదారులను నిర్మించాడు. గోల్కొండ రాజ్యంలో పోగు పడిన అపరిమిత సంపదను ఔరంగాజే దేశవ్యాప్తంగా ఉపయోగించుకున్నాడు.
సంపద సృష్టికర్తలైన స్థానిక గోల్కొండ ప్రజలు కడుదయనీయంగా బతుకులు వెల్లదీస్తున్నారు. దీనికి తోడు కరువులు క్షయ ప్లేగు వంటి అంటూ వ్యాధులు ప్రబలి గోల్కొండ రాజ్య ప్రజల జీవనం దయనీయ స్థితికి మారింది.

చరిత్రకు అవసరమైనప్పుడు కాలం కడుపుతో ఉండి ఒక వీరున్ని ప్రసవిస్తుంది. భూగర్భము నుండి ఎగేసి భూమిని అంటిపెట్టుకొని శ్రామిక ప్రజల మనుషులందరికీ ఒకే విలువ ఉండాలని తపించిన సర్వాయి పాపడిని తెలంగాణ తల్లి కన్నది. – విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్

చరిత్రకు అవసరమైనప్పుడు కాలం కడుపుతో ఉండి ఒక వీరున్ని ప్రసవిస్తుంది. భూగర్భము నుండి ఎగేసి భూమిని అంటిపెట్టుకొని శ్రామిక ప్రజల మనుషులందరికీ ఒకే విలువ ఉండాలని తపించిన సర్వాయి పాపడిని తెలంగాణ తల్లి కన్నది.

వరంగల్ జిల్లాలోన తాటికొండ గ్రామంలో జన్మించిన పాపన్న బాల్యంలోనే తన గౌండ్ల కుల వృత్తిని కొనసాగించనని ప్రతిజ్ఞ చేశాడు. శ్రామిక కులాలు నైపుణ్యాలని, శాస్త్రీయ జ్ఞానాన్ని, నిర్వహణ నైపుణ్యాలను కలిగి ఉన్నాయి. ఇవి ఏమి లేని వారు స్థానిక పాలకులుగా, రాజులుగా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. గోల్కొండ కోటపై శ్రామికుల జెండాను ఎగరవేస్తానని, శ్రమ శక్తినే పాలనాశక్తిగా చేస్తానని ప్రతినపునాడు.

1708లో గోల్కొండ రాజ్యంలో రెండవ సంపదవంతమైన నగరం వరంగల్ పై మూడు వేల మంది సైన్యంతో దాడి చేశారు. ఇక్కడ దోచిన సొమ్ముతో డచ్ ఆంగ్ల వర్తకుల నుండి అధునాతన ఆయుధాలను కొనుగోలు చేశాడు. – విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్

తన బంధువుల సహాయంతో చిన్న సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తాటికొండలో తొలికోటను నిర్మించాడు. అద్భుతమైన ఇంజినీరింగ్ నైపుణ్యంతో చతుర్భుజ ఆకృతిలో,మధ్యభాగంలో అతి పెద్ద డోమ్ తో ఖిలాశాపూర్ కోటను నిర్మించాడు. గోల్కొండ నగరానికి అన్ని రహదారులపై నిత్యం దాడులు చేస్తూ వ్యాపారస్తుల సొమ్మును,సరుకుల్ని దోపిడీ చేశాడు. ప్రజల్ని బాగా పీడిస్తున్న స్థానిక హిందూ,ముస్లిం భూస్వాములపై దాడి చేస్తూ వారి ఆస్తులను హస్తగతం చేసుకున్నాడు. ఆ ప్రాంత ప్రజలను వెట్టి చాకిరి నుండి విముక్తి చేశాడు. భూములను ప్రజలకు పంచి పెడుతూ మిగతా సొమ్మును కోటల నిర్మాణానికై వెచ్చించాడు. తన ప్రధాన సహాయకులు సర్వ మరియు పూర్థిల్ ఖాన్ లతో కలిసి , అనేక కోటలను చేజిక్కించుకున్నాడు. ఒకప్పుడు పరిపాలనలో కీలక స్థానంలో ఉండి ఔరంగజేబు హయాంలో తమ స్థానాన్ని కోల్పోయిన చిన్న భూస్వాములు పాపన్నకు అండగా నిలిచారు. మొగల్ సామంత రాజుల ప్రభువులు ఔరంగజేబుకు పాపన్న నుండి రక్షించాలని మొరపెట్టుకున్నారు. ఆఫ్గాన్ యుద్ధ యోధుడు కాసింఖాన్ ను 1702 లో గోల్కొండ డిప్యూటీ గవర్నర్ రుస్తుం దిల్ ఖాన్ 1705లో చంపించడానికి పెద్ద సైన్యం పంపించారు. పాపన్న గెరిల్లా యుద్ధంలో కాసిం ఖాన్ ను చంపేశాడు. రుస్తుం ను ముప్పు తిప్పలు పెట్టాడు. తన విముక్త సమాంతర పరిపాలన ప్రాంతాన్ని గోదావరి కృష్ణ భీమా నదుల మధ్య వరకు విస్తరించుకుంటూ వెళ్ళాడు.

ఔరంగజేబు మరణం తర్వాత బహుదూర్ షా మొగల్ చక్రవర్తి అయ్యాడు. సర్వాయి పాపన్నను నిలువరించలేమని తెలుసుకున్న బహుదూర్ షా తన గోల్కొండ దర్బారుకు ఆహ్వానించి పాపన్నకు ప్రభువు హోదానిచ్చాడు.విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్

1708లో గోల్కొండ రాజ్యంలో రెండవ సంపదవంతమైన నగరం వరంగల్ పై మూడు వేల మంది సైన్యంతో దాడి చేశారు. ఇక్కడ దోచిన సొమ్ముతో డచ్ ఆంగ్ల వర్తకుల నుండి అధునాతన ఆయుధాలను కొనుగోలు చేశాడు. 1707 లో ఔరంగాజేబు మరణం తర్వాత అస్తవ్యస్తంగా ఉన్న గోల్కొండ రాజ్యంలో సర్వాయి పాపన్న మరింత విజృంభించి భువనగిరి కోట తో సహా అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు.

ఔరంగజేబు మరణం తర్వాత బహుదూర్ షా మొగల్ చక్రవర్తి అయ్యాడు. సర్వాయి పాపన్నను నిలువరించలేమని తెలుసుకున్న బహుదూర్ షా తన గోల్కొండ దర్బారుకు ఆహ్వానించి పాపన్నకు ప్రభువు హోదానిచ్చాడు. భారతీయ సామాజిక చరిత్రలో ఒక కల్లు గీసే వ్యక్తి ప్రభువు హోదాను పొందడం సర్వాయి పాపన్న తోనే ప్రారంభమైంది .ఆ కాలంలోనే పాపన్న లక్షా నలభై వేల రూపాయలను, పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను మొగల్ చక్రవర్తికి ఇచ్చుకున్నాడు. తన ప్రభువు హోదాకు పరిపూర్ణమైన న్యాయం చేశాడు.తన పరంపరలో ప్రధాన సహాయకులుగా ఉన్న వృత్తి కులాల ప్రజలకు ముస్లిం మైనార్టీలకు, ఆదివాసి సమూహాలకు అనంతమైన సేవను అందించాడు. భూ పంపిణీ, సమిష్టి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాడు.గ్రామీణ దేవతా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ప్రజలు ఎలాంటి ఆధిపత్య,దోపిడి,పీడనలు లేని సమాజంలో బతకడం ప్రారంభమైంది. ఇంతటి ప్రజారంజక పాలనతో రోజురోజుకు ప్రజలలో ప్రఖ్యాతి పొందుతున్న పాపన్నను ఓర్వలేని భూస్వామ్య శక్తులు మోఘల్ చక్రవర్తికి తప్పుడు ఫిర్యాదులు చేసారు. అతనిని తొలగించకపోతే దేశానికే పాలకుడు అయ్యే అవకాశం ఉందని చక్రవర్తిని తెలియజేశారు. దిలావర్ ఖాన్ ,యూసఫ్ ఖాన్ నేతృత్వంలో 20వేల మంది సైన్యం సర్వాయి పాపన్న పై దాడి చేశాయి. వారిని ముప్పు తిప్పలు పెడుతూ చివరకు ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పట్టుకొని హత్య చేశారు. శ్రామిక వర్గాల ప్రజలకు దీపశిఖగా నిలిచిన సర్వాయి పాపన్న చరిత్రలో చెరగని ముద్ర వేశాడు. ఆ తర్వాత జరిగిన తెలంగాణలోని అన్ని పోరాటాలలో పాపన్న ప్రవహించే ఉత్తేజంగా నిలిచాడు.

కేసీఆర్ ప్రభుత్వం గౌడ్ ప్రజలకు తాటి పన్నును రద్దు చేసింది వైన్ షాపులలో 15% రిజర్వేషన్ కల్పించింది .నీరా పాలసీని తీసుకొచ్చి ఆర్థిక వికాసం కోసం పాటుపడింది కల్లు గీత కార్మికుల కు పెన్షన్ సౌకర్యం కూడా ఇచ్చింది పాపన్న నిర్మించిన కోటలను కట్టడాలను పరిరక్షణ కోసం నిధులను మంజూరు చేసింది.- విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్

ఇతిహాసాన్ని పోలివున్న సర్వాయి పాపన్న చరిత్రకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సముచిత ప్రాధాన్యాన్ని ఇచ్చింది. పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. పాపన్న పరిపాలన తాత్వికతను ఆవాహన చేసుకున్న కేసిఆర్ సబ్బండ కులాల ఆర్థిక వికాసం కోసం పలు సంక్షేమ ఉత్పాదక కార్యక్రమాలను చేపట్టాడు. గౌడ్ ప్రజలకు తాటి పన్నును రద్దు చేసింది వైన్ షాపులలో 15% రిజర్వేషన్ కల్పించింది .నీరా పాలసీని తీసుకొచ్చి ఆర్థిక వికాసం కోసం పాటుపడింది కల్లు గీత కార్మికుల కు పెన్షన్ సౌకర్యం కూడా ఇచ్చింది పాపన్న నిర్మించిన కోటలను కట్టడాలను పరిరక్షణ కోసం నిధులను మంజూరు చేసింది.

ఇతిహాసాన్ని పోలివున్న సర్వాయి పాపన్న చరిత్రకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం సముచిత ప్రాధాన్యాన్ని ఇచ్చింది. పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. – విరసనోళ్ళ శ్రీనివాస్ గౌడ్

సర్వాయి పాపన్న చరిత్రను స్ఫూర్తిని కాపాడుకుని ఆ ఉత్తేజంతో రాజ్యాంగ వ్యతిరేకంగా పాలిస్తున్న కేంద్ర పాలకుల నియంతృత్వ పాలనపై ప్రజాస్వామిక యుద్ధాన్ని చేయవలసిన చారిత్రక కర్తవ్యం లో తెలంగాణ శ్రామిక వర్గ ప్రజలు ముందు నిలవడమే మనమిచ్చే నిజమైన నివాళి.

అస్నాల శ్రీనివాస్, అసోసియేట్ ఎడిటర్‌, టీజీవో న్యూస్ సౌజన్యంతో