కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు – 2022 లిస్ట్

న్యూడిల్లీ (డిసెంబర్ – 22) : దేశంలోని 23 భాషలకు ఉత్తమ రచనలు, రచయితలకు కేంద్ర సాహిత్య అకాడమీ (sahitya akademi awards 2022) అవార్డులు – 2022 కు గాను చైర్మన్ చంద్రశేఖర్ కంబార్ ప్రకటించారు. ఈ పురస్కారం కింద తామ్ర ఫలకం, 50వేల నగదును అందజేయనున్నారు.

కవితలు (7) , నవలలు (6), చిన్న కథలు (03), నాటికలు (02) , జీవిత చరిత్రలు (1), ఆర్టికల్స్(1), సాహిత్య చరిత్ర(1), సాహిత్య విమర్శ(1), అనువాద రచనల (17)లకు అవార్డులను ప్రకటించారు.

మధురాంతకం నరేంద్ర రాసిన ‘మనో ధర్మపరాగం’ నవలకు తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్
రాసిన ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. గుల్జార్ రాసిన గ్రీనో పోయెమ్స్ పవన్ కే వర్మ ఆంగ్లానువాదం తోడ్పాటుతో ‘ఆకుపచ్చ కవితలు’ పేరుతో తెలుగులోకి అనువదించారు.

అనువాద విభాగంలో అవార్డులను బెంగాలీ‌, కొంకణి, మైథిలి, హిందీ, మణిపురి‌, ఒడియా, సంతాలి భాషలలో తర్వాత ప్రకటించనున్నారు.